రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-V’ పంపిణీపై డాక్టర్ రెడ్డీస్ డీల్.. ఇండియాలో నవంబర్ నుంచి టీకా

  • Published By: sreehari ,Published On : September 16, 2020 / 03:49 PM IST
రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-V’ పంపిణీపై డాక్టర్ రెడ్డీస్ డీల్.. ఇండియాలో నవంబర్ నుంచి టీకా

Updated On : September 16, 2020 / 6:18 PM IST

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-V కరోనా వ్యాక్సిన్ పంపిణీపై భారతీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ డీల్ కుదుర్చుకుంది. రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల సంస్థ (RDIF), రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ లతో రెడ్డీస్ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల పంపిణీకి ఒప్పందం కుదిరింది. భారతదేశంలో నవంబర్ నుంచి క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు స్పుత్నిక్-వి సిద్ధమవుతోంది. ఈ ట్రయల్స్ కాని విజయవంతమైతే మాత్రం నవంబర్ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి వచ్చేస్తుంది.. ఒప్పందంలో భాగంగా RDIF భారత రెడ్డీస్ ల్యాబరేటిస్‌కు 100 మిలియన్ డోస్‌లను పంపిణీ చేయనున్నట్టు RDIF సీఈఓ Kirill Dmitriev ఒక ప్రకటనలో వెల్లడించారు.



https://10tv.in/russia-eyes-two-in-one-vaccine-against-cornavirus-and-flu/
అడినోవైరల్ వెక్టార్ ప్లాట్ ఫాం ఆధారంగా Sputnik V vaccine అభివృద్ధి చేసినట్టు Dmitriev చెప్పారు. అనుకున్నట్టుగా వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్ అయితే ఈ ఏడాది నవంబర్ నెలలోనే భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుందని చెప్పారు. దేశంలో కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు మరో నాలుగు భారతీయ తయారీ సంస్థలతో RDIF చర్చలు జరుపుతోంది. దశబ్దాల కాలంలో రష్యా వ్యాక్సిన్ కనిపెట్టడంలో 250కు పైగా క్లినికల్ అధ్యయనాలను హ్యుమన్ అడినోవైరల్ వెక్టార్ పైనే నిర్వహించారు. దీర్ఘకాలిక ప్రతికూల పరిస్థితులు లేకుండా సురక్షితమైన వ్యాక్సిన్ కనుగొన్నామని పేర్కొంది.



స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మొదటి దశ, రెండో దశ ఫలితాలు విజయవంతం కావడంతో భారతదేశంలో మూడో దశ ట్రయల్స్ పరీక్షించేందుకు సిద్ధమైంది.. భారతీయ నియంత్రిత అవసరాలకు తగినట్టుగా ఈ ట్రయల్స్ జరుగనున్నాయి. మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని, చాలామందిలో యాంటీబాడీలు తయారయ్యాయని నిర్ధారణకు వచ్చారు. ఇక మూడో దశ అధ్యయనాలకు సంబంధించి అక్టోబర్-నవంబర్ నెలలో వెల్లడించే అవకాశం ఉంది.