Respiratory Problems : చలికాలంలో చల్లిటి పొడిగాలి, వాతావరణ కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు! అప్రమత్తత అవసరమే?
చలికాలంలో సహజంగా మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణంగానే జలుబు, దగ్గు తొందరగా వస్తాయి. వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. బయటి పాస్ట్‌ఫుడ్‌ను దూరం పెట్టాలి.

Respiratory Problems
Respiratory Problems : వేసవి, వానకాలాల కంటే చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అస్తమా, శ్వాస కోశ, న్యూమోనియా వంటి వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చలి కాలంలోనే జలుబు, దగ్గు వంటివి త్వరగా వ్యాపిస్తాయి. గోరువెచ్చని నీటినే తాగాలి. సాధ్యమైనంత వరకు వేడి ఆహార పదార్థాలను తినటం మంచిది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు రాకూడదు.
సీజన్‌లో మార్పు కారణంగా వాతావరణంలో చల్లటి, పొడి గాలితో పాటు కాలుష్యం పెరగడం, శ్వాసనాళాలను చికాకుపెడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, శ్వాసలోపం, ఆస్తమా దాడులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. వాస్తవానికి కలుషితమైన గాలి శ్వాసకోశ పరిస్థితులను మరింత దిగజార్చ బడతాయి.
చలికాలంలో శరీరానికి వెచ్చదాన్నిచ్చే దుస్తులను ధరించాలి. ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం తగ్గించాలి. రోజుకు 4-6 లీటర్ల నీరు సేవించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. సమతుల ఆహారం తీసుకోవటంతోపాటు అధిక మోతాదులో కాకుండా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేందుకు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. జామ, దానిమ్మ, బొప్పాయి, బత్తాయి పండ్లు తినాలి. ముఖ్యంగా విటమిన్-సి ఉన్న ఫలాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
చలికాలంలో సహజంగా మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణంగానే జలుబు, దగ్గు తొందరగా వస్తాయి. వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. బయటి పాస్ట్‌ఫుడ్‌ను దూరం పెట్టాలి. చర్మం దెబ్బతినకుండా మాశ్చురైజ్డ్ ఆయిల్స్ రాసుకోవాలి. సాధారణ సబ్బుల స్థానంలో గ్లిజరిన్ ఆధారిత సబ్బులను వాడాలి. శనగపిండితో స్నానం చేస్తే చర్మానికి మేలు కలుగుతుంది.
చల్లని, పొడి గాలి మరియు వాతావరణంలో ఆకస్మిక మార్పులు వాయుమార్గాలను చికాకుపెడుతుంది, దీని వలన ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి అవుతుం. రోగులు వారి మందులను సరిగ్గా తీసుకోకపోతే సమస్య తీవ్రతరం అవుతుంది. ఆరోగ్య పరంగా చలికాలంలో ఎలాంటి ఇబ్బంది కరమైన పరిస్ధితి ఎదురైనా వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందటం మంచిది.