Cholesterol : కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచే బచ్చలి కూర!
బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

Bachali Kura
Cholesterol : శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లు, అనేక పోషకాలు ఆకుకూరల్లో లభిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరల్లో బచ్చలి కూర ముఖ్యమైనది. బచ్చలి కూరతో వివిధ రకాలైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. బచ్చలి కూర ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. విటమిన్ ఏ తో పాటు బీటాకెరాటిన్ కూడా అధికంగా ఉండే బచ్చలి కూర తీసుకోవడం వల్ల కంటి సమస్యలతో పాటు రక్తహీనత తొలగిపోతుంది. రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ సి కూడా బచ్చలి కూరలో ఉంటుంది.
శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. మూత్రవిసర్జనలో ఏవైనా సమస్యలు ఉంటే ఉపశమనం కలిగించటంతోపాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యను ఉపశమనం లభిస్తుందట. వేసవి కాలంలో బచ్చలి కూరను తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు.
బచ్చలి కూర రసం, స్మూతీ గా తయారు చేసుకుంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి. బచ్చలి కూర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు లోని సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి. బచ్చలి కూర నైట్రేట్ల కు గొప్ప మూలం. బచ్చలిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియలతోపాటు, ప్రేగు కదలికలను సులభతరం చేసేందుకు ఇందులో ఉండే ఫైబర్ సహాయపడుతుంది.
గమనిక ; వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని అందించటం జరిగింది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.