Hair Loss : జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారా?

హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటనింగ్ వంటి పరికరాలు జుట్టుకు అస్సలు మంచివి కావు. వీటిని అతిగా వాడితే జుట్టు కుదుళ్లు నాశనమవుతాయి. జుట్టు పెరుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి.

Hair Loss : జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారా?

Hair

Updated On : January 9, 2022 / 1:08 PM IST

Hair Loss : జట్టు రాలటం అనేది సాధారణ సమస్య. దీనికి అనేక కారణాలు ముడిపడి ఉన్నాయి. జుట్టు రాలడం చిన్న సమస్య అయినా ముఖ్యంగా మహిలలను ఈ సమస్య మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన, దృఢమైన జుట్టును స్త్రీ, పురుషులిద్దరూ కోరుకుంటారు.

ఇటీవలికాలంలో అందమైన జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. చర్మసౌందర్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆరోగ్యకరమైన జుట్టుకి కూడా మంచి పోషకాలు అందించాలి. అయితే జుట్టుపోషణకోసం కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే ఆహారం,అలవాట్లు జుట్టుకు హాని కలిగిస్తుంది.

ఒత్తిడి, కాలుష్యం కూడా జుట్టుపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు కూడా జుట్టు రాలడానికి దోహదపడతాయి. వాటి నుంచి దూరంగా ఉంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది.. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

పొగతాగేవారిలో జుట్టు కుదుళ్లలోని డీఎన్ఏను నాశనం చేసి జుట్టు ఎదగకుండా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. ఆల్కహాల్ ఈ ప్రోటీన్ సంశ్లేషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దాంతో జుట్టు బలహీనంగా మారుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే మంచిది.

సాధారణంగా జుట్టు సమస్యలకు ఒత్తిడి మరియు జన్యుశాస్త్రం కారణమని చెబుతారు. అయితే కొన్ని ఆహారపదార్థాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడకపోగా వెంట్రుకలు రాలిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. కొందరు తక్కువ సమయంలో బరువు తగ్గటానికి ఆహారంలో కోత విధించి పోషకాలను కోల్పోతారు. ఈకారణంగా కూడా జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చక్కెర జుట్టుకు ఎంత చెడ్డదో మొత్తం ఆరోగ్యానికి కూడా అంతే చెడ్డది. మధుమేహం మరియు స్థూలకాయానికి దారితీసే ఇన్సులిన్ నిరోధకత జుట్టును కోల్పోయేలా చేస్తుంది. బట్టతల రావడానికి కూడా చక్కెర ఓ ప్రధాన కారణంగా చెబుతారు పోషకాహార నిపుణులు.

జంక్ ఫుడ్స్ మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. ఇది ఊబకాయంతో పాటు గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. జుట్టును కోల్పోయేలా చేస్తుంది. ఆయిల్ ఫుడ్స్ తలపై కుదుళ్ళను జిడ్డుగా మార్చుతాయి. తలపై ఉన్న రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది.

చేపలు తినడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. సముద్రపు నీటి చేపలు స్వోర్డ్ ఫిష్, మాకేరెల్, షార్క్ మరియు కొన్ని రకాల ట్యూనా చేపలలో పాదరసం ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉంటే మంచిది. కొన్ని రకాల చేపలు జుట్టుకు మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తాయి.

హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటనింగ్ వంటి పరికరాలు జుట్టుకు అస్సలు మంచివి కావు. వీటిని అతిగా వాడితే జుట్టు కుదుళ్లు నాశనమవుతాయి. జుట్టు పెరుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒత్తిడి వల్ల జుట్టు రాలడమే కాకుండా హెయిర్ పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి, రోజు వ్యాయామం లేదా యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ఎండలో ఎక్కువ సేపు ఉంటే యూవీ రేస్ నుంచి వెలువడే రేడియేషన్ జుట్టుకు హానికలిగిస్తుంది. ఇవే విషయం పరిశోధనల్లో తేలింది. తలలోని ప్రోటీన్లకు నష్టం కలిగిస్తాయి. ఎండలోకి వెళ్లేప్పుడు టోపీ పెట్టుకోవడం మంచిది. అది మీ జుట్టును యూవీ రేస్ నుంచి నుంచి రక్షిస్తుంది.