మార్పు మంచికే : తెలంగాణలో బాగా తగ్గిన ప్రసూతి మరణాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2015-16 గణాంకాల ప్రకారం.. ఇండియాలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసూతి ఆస్పత్రుల్లో 91.5 శాతం డెలివరీలు (శిశు జననాలు) జరిగాయి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2015-16 గణాంకాల ప్రకారం.. ఇండియాలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసూతి ఆస్పత్రుల్లో 91.5 శాతం డెలివరీలు (శిశు జననాలు) జరిగాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2015-16 గణాంకాల ప్రకారం.. ఇండియాలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసూతి ఆస్పత్రుల్లో 91.5 శాతం డెలివరీలు (శిశు జననాలు) జరిగాయి. ప్రసూతి వైద్యంలో తెలంగాణ గొప్ప రికార్డు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రసూతి వైద్య ఆస్పత్రుల్లో డెలివరీలు నమోదుకాగా, 30 శాతం డెలివరీలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగినట్టు నివేదిక వెల్లడించింది. ఇండియాలో అత్యధికంగా సాధారణ డెలివరీల కంటే.. సీజేరియన్ డెలివరీల శాతం 50 వరకు ఉన్నట్టు సర్వేలో తేలింది. అందులో సీజేరియన్ ఆపరేషన్స్ జరిగిన కేసుల్లో ఎక్కువ శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే మహిళలు డెలివరీ అయినట్టు ప్రభుత్వ వైద్య అధికారులు తెలిపారు.
C-సెక్షన్ ఆపరేషన్లు తగ్గించడమే లక్ష్యంగా..
రాష్ట్రంలో సీ సెక్షన్ డెలివరీలను తగ్గించి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు జరిగేలా కేసీఆర్ ప్రభుత్వం వరుస సంస్కరణలను అమలు చేసింది. దీంతో రాష్ట్రంలో సీ-సెక్షన్ డెలివరీలు తగ్గిపోవడమే కాకుండా ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) కూడా బాగా తగ్గిపోయినట్టు తెలిపింది. 2011-13 మధ్యకాలంలో ప్రతి లక్ష జననాలకు ప్రసూతి మరణాల రేటు (బాలింత మరణాలు) 92గా ఉంటే.. 2014-16 నాటికి 81 వరకు భారీగా తగ్గిపోయింది. ప్రసుత్తం తెలంగాణలో MMR రేటు (ప్రతి లక్ష జననాలకు) 70 మార్క్ కు చేరువలో ఉంది.
పాన్-ఇండియా లో ప్రసూతి మరణాల రేటు 167 నుంచి క్రమంగా 130కి పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వ్యవధిలో ప్రసూతి మరణాల రేటు భారీగా తగ్గిపోవడం ఎంతో అద్భుతమని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డేటా ప్రకారం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలు 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగాయి. 2018-19 కాలంలో రాష్ట్రంలో మొత్తంలో 3.8 లక్షల డెలివరీలు జరిగాయి. ఇందులో 22వేల 588 వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు కాగా, 1లక్ష 57వేల 690 డెలివరీలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగాయి. ఇదే దిశగా కొనసాగితే.. త్వరలోనే యూనైటెడ్ నేషన్స్ లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్రం చేరుకోనే అవకాశం ఉంది.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే సంజీవని :
తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి వైద్యంలో సాధించిన పురోగతిపై ఐఏఎస్ అధికారిణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కరుణ వక్తి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అమలు చేసిన ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ఆధారణ ఎంతగా పొందాయో కరుణ చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మెటర్నల్ హెల్త్ పరిస్థితి ఎలా ఉందని, మెటర్నిటీ సమస్యలను అధిగమించడానికి ఏలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందో తనను అడిగినట్టు కరుణ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శిశువుల జననాల కోసం ప్రసూతి ఆస్పత్రులను ఎందుకు పెంచాల్సిన అవసరం ఉందో కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి కరుణ వక్తిని అక్టోబర్ 2016లో నియమించారు.
ప్రసూతి మరణాలను తగ్గించే దిశగా..
సీజేరియన్ ఆపరేషన్స్ (సీ-సెక్షన్స్) రేటు ఎక్కువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని మహిళలు ప్రసవ సమయాల్లో నాణ్యమైన వైద్యసహాయాన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పొందలేకపోవడం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రసూతి వైద్యానికి సంబంధించి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటిని రాష్ట్రంలో మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుందామని చెప్పినట్టు కరుణ తెలిపారు. తెలంగాణ రాష్టంలో ప్రసూతి మరణాల రేటును తగ్గించాలనే లక్ష్యంతో ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా చేపట్టినట్టు ఆమె తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల వల్లనే తెలంగాణ రాష్ట్రం కేవలం పది నెలల్లోనే ఈ రికార్డును నమోదు చేసిందని, తమిళనాడు రాష్ట్రానికి అయితే దాదాపు 15 ఏళ్ల సమయం పట్టిందని కరుణ తెలిపారు. 2018 సెప్టెంబర్ లో ఆరోగ్య శాఖలో పదవీకాలం పూర్తి అయ్యాక ప్రస్తుతం కరుణ.. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లో కమిషనర్ గా పనిచేస్తున్నారు.
ప్రసూతి మరణాల రేటు తగ్గడానికి రాష్ట్రంలో అమలు చేసిన ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైనవి ఇవే..
1. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి డెలివరీ సౌకర్యాలను అప్ గ్రేడ్ చేయడం (ల్యాబర్ రూమ్స్ పెంచడం, మహిళలకు వైద్యసదుపాయం అందుబాటులో ఉంచడం)
2. కేసీఆర్ కిట్ స్కీమ్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ స్కీమ్.. ఎంతో మంది మహిళలు ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ స్కీమ్ ను 2017 జూన్ లో ప్రవేశపెట్టారు. ఆర్థిక స్థోమత లేని మహిళలు తమ ప్రసవానికి ఉచితంగా వైద్యసాయం పొందేందుకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడింది. సరైన సమయానికి డెలివరీ చేయడం.. డెలివరీ అయిన మహిళ, తనబిడ్డకు రూ.2వేలు విలువైన కేసీఆర్ కిట్ (బేబీ ఆయిల్, సోప్, టాల్కమ్ పౌడర్, దోమల తెర, బ్లాంకెట్) ఐటమ్స్ అందించారు.
3. మహిళ ప్రెగ్నెంట్ అయిన మూడో నెల నుంచి డెలివరీ అయ్యే వరకు మొత్తం 13వేలు నుంచి 14వేలు వరకు నేరుగా తల్లి బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేయడం. ప్రెగ్నెంట్ సమయంలో తొలిసారి రూ.3వేలు నేరుగా తల్లి బ్యాంకు అకౌంట్ లో వేయడం.. డెలివరీ సమయంలో మగబిడ్డ జన్మిస్తే.. రూ.4వేలు బదిలీ చేయడం.. అదే ఆడబిడ్డ అయితే రూ.5వేలు అకౌంట్ కు బదిలీ చేశారు.
4. శిశువు జన్మించిన అప్పటి నుంచి 3.5 నెలల్లో బిడ్డ ఆరోగ్య పోషణకు రూ.2వేలు బదిలీ చేయడం.. చివరిగా.. బిడ్డ వ్యాధినిరోధక శక్తి పెరగడానికి అవసరమైన పోషణ అందించడానికి వీలుగా తల్లి అకౌంట్ కు మొత్తం రూ.3వేలను బదిలీ చేయడం.
5. 102 అమ్మ ఒడి వాహనాలను ప్రవేశపెట్టడం.. 2017 ఏడాది చివరిలో ఈ స్కీమ్ ను అమల్లోకి తెచ్చారు. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ 102 కాల్ చేయగానే అత్యవసర సమయాల్లోనే కాదు.. 24/7 గంటలపాటు ఆస్పత్రులకు వెళ్లి వచ్చేందుకు ఉచితంగా ఈ సర్వీసును అందించడం.. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లోని మహిళలు ప్రెగ్నెసీ సమయాల్లో రవాణా సౌకర్యం కోసం ఈ స్కీమ్ ను అమల్లోకి తెచ్చారు.