Summer Avoid Foods : వేసవిలో ఆ ఆహారాలు ఆరోగ్యానికి మంచిదికాదు!

డీప్-ఫ్రైడ్ ఐటమ్స్ వంటి జిడ్డుగల ఆహారాలు, జంక్ ఫుడ్స్ వేసవిలో కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది. వీటి వల్ల తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి. వేసవికాలంలో ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటే అవి శరీర వేడిని పెంచుతాయి.

Summer Avoid Foods : వేసవిలో ఆ ఆహారాలు ఆరోగ్యానికి మంచిదికాదు!

Summer Avoid Foods

Updated On : March 25, 2022 / 12:34 PM IST

Summer Avoid Foods : వేసవి కాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని రకాల వ్యాదులు ఈ కాలంలో మనిషిని చుట్టు ముట్టే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రధానంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తుల పాటించటం అవసరం. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదన్న దానిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరానికి ఆహారాలను అందించటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. వేసవిలో సూప్ లు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారపదార్థాలు వేసవిలో ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. అలాంటి వాటిని దూరంగా ఉంచటం మంచిది.

వేసవి ఎండల్లో బయట బాగా తిరిగి ఇంటికి చేరాక చల్లగా ఏదైనా తాగలని అనిపిస్తుంది. అలాంటి సమయంలో చాలామంది ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ను గటగటా తాగేస్తుంటారు. అలా తాగడం మంచిది కాదు. ఇలా చేస్తే శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టుండి పెరిగిపోతుంది. అంతేకాకుండా వేసవికాలంలో ఒక గ్లాసు చల్లటి వైన్ తాగాలని కోరిక కలుగుతుంది. ఇలా చేస్తే ఆల్కహాల్ వెంటనే మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది, మద్యం వేసవిలో నిర్జలీకరణాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని తగ్గించి అనేక వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది.

డీప్-ఫ్రైడ్ ఐటమ్స్ వంటి జిడ్డుగల ఆహారాలు, జంక్ ఫుడ్స్ వేసవిలో కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది. వీటి వల్ల తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి. వేసవికాలంలో ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటే అవి శరీర వేడిని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. వేసవిలో క్రమం తప్పకుండా కాఫీ మరియు టీ తీసుకోవడం వల్ల శరీర వేడి, నిర్జలీకరణం పెరుగుతుంది. గ్రీన్ టీ , ఐస్‌డ్ కాఫీలతో ప్రత్యామ్నాయం గా తీసుకోవటం వల్ల వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష, నేరేడు పండు మొదలైనవి చాలా ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వేసవిలో శరీర ఉష్ణోగ్రతలను పెంచుతాయి. అలసట, చికాకు కారణమౌతాయి. ఏలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను వంటల్లో వాడటం తగ్గించాలి. వీటి వల్ల సైతం వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. జీలకర్ర, సేంద్రీయ పుదీనా మొదలైన చల్లదనాన్ని ఇచ్చే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించుకోవచ్చు.

వేసవికాలం వచ్చే మామిడి కాయలను తినేందుకు చాలా మంది అమితంగా ఆసక్తి చూపిస్తుంటారు. మామిడిపండ్లు శరీర వేడిని పెంచుతాయి. విరేచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి మొదలైన వ్యాధులకు దారితీస్తాయి. మామిడి పండ్లను మితంగా తీసుకోవటం మంచిది. కాల్చిన మాంసం అధిక ఉష్ణోగ్రతల వద్ద వండుతారు. వేసవిలో అధిక వేడికి అలాంటి మాంసాన్ని తీసుకోవటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగుతుంది. ఐస్ క్రీమ్ లు సహజంగా వేసవి లో ఎక్కువగా ఇష్టడుతుంటారు. ఐస్‌క్రీమ్‌లు వేసవిలో చాలా మంది ఎక్కవగా ఇష్ణపడుతుంటారు. ఐస్ క్రీమ్ లలో కొవ్వు, చక్కెర పదార్థాలు అధికంగా ఉంటాయి. ఊబకాయం మరియు మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.