కరోనా వైరస్ ను ఈ మూడు స్టెప్స్‌లో ఈజీ జయించొచ్చు. మరి పాటిస్తున్నామా?

  • Published By: sreehari ,Published On : July 23, 2020 / 03:30 PM IST
కరోనా వైరస్ ను ఈ మూడు  స్టెప్స్‌లో ఈజీ జయించొచ్చు. మరి పాటిస్తున్నామా?

Updated On : July 24, 2020 / 11:45 AM IST

కరోనా వైరస్ ఎలా ఎదుర్కోవాలో ఈ మూడు సులభమైన మార్గాలను తెలుసుకోవాల్సిందే.. అందిరికి తెలిసినవే అంటున్నారు వైద్య నిపుణులు.. COVID-19 వ్యాప్తిని కంట్రోల్
చేయడానికి చేతితో కడగడం, సామాజిక దూరం వంటి తప్పనిసరిగా పాటించాలని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల కొత్త పరిశోధనలో తేలింది.

సామాజిక దూరంతో పాటు శానిటైజేషన్ వంటి చర్యలు ఎంతగా ప్రభావవంతంగా ఉన్నాయో పరిశీలించడానికి పరిశోధకులు కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించారు. మాస్క్ ధరించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించడంలో ప్రభావంతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇది చౌకైన పరిష్కారంగా తేల్చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక, సామాజిక ఫాబ్రిక్‌కు అంతరాయం కలిగించదని అభిప్రాయపడ్డారు.

వ్యాపారాలను మూసివేయడం, ప్రయాణాలు రద్దు చేయడం, ఇంటి వద్దే ఆర్డర్లు వంటివి COVID-19 వ్యాప్తిని ఏడు నెలల వరకు ఆలస్యం చేయగలవని కనుగొన్నారు. మాస్క్‌లు ధరించడం, చేతులు బాగా కడుక్కోవడం సర్వ సాధారణమైంది. సామాజిక దూరాన్ని కొనసాగించడం ద్వారా కరోనా వ్యాప్తి క్రమంగా
తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

COVID-19 సోకితే ఎంత ప్రాణాంతకమో ప్రజల్లో అవగాహన ఉండటం తప్పనిసరి.. ఈ చర్యలను పాటిస్తే.. కరోనా నుంచి 90 శాతం సురక్షితంగా బయటపడొచ్చు.. చేతులు
కడుక్కోవడం, సామాజిక దూరం వంటి చర్యలను పాటించడం ద్వారా సంపూర్ణంగా అంతం చేయలేకపోయినా COVID-19 రెండవ తరంగాన్ని నివారించవచ్చని పరిశోధకులు
అంచనా వేశారు.

COVID -19 నుంచి ఒకరి నుంచి మరొకరికి తెలియకుండానే వ్యాపించవచ్చు. అయినప్పటికీ, రోజ్నోవా ఆమె బృందం అభివృద్ధి చేసిన ‘మోడల్’ చాలా అధునాతనమైనదిగా పరిశోధనలో రుజువైంది. COVID-19 వ్యాప్తిని తగ్గించడంలో ఈ చర్యలు ప్రభావంతంగా పనిచేస్తాయని అంటున్నారు.

ఈ రక్షణ చర్యలు COVID-19 వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. జూలై 14న, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక నివేదికను ప్రచురించింది. మిస్సౌరీలోని
ఇద్దరు హెయిర్ స్టైలిస్టులకు COVID-19 పాజిటివ్ అని తేలింది.

అంతకుముందే వారు 139 మంది కస్టమర్లకు హెయిర్ కంటింగ్ చేశారు. కస్టమర్లలో ఎవరిలోనూ కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించలేదు. ఆ తర్వాత 67 మంది కస్టమర్లను పరీక్షించగా.. అందరికి నెగటివ్ అని వచ్చింది. ఫేస్ మాస్క్ ధరించడం వల్ల SARS-CoV-2 వ్యాప్తిని తగ్గించవచ్చునని పరిశోధకులు తేల్చారు.