Lemon Slices : బెడ్ రూంలో నిమ్మ ముక్కలు ఉంచితే కలిగే ప్రయోజనాలు ఇవే?
శ్వాసనాళ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి నిమ్మను రూమ్ లో ఉంచటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. బెడ్రూంలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవ్వడంతో పాటు బాగా నిద్రపడుతుంది.

Lemon
Lemon Slices : నిమ్మకాయ.. మంచి సువాసన, రుచి కలిగిన సిట్రస్ జాతికి చెందిన కాయ ఇది. వీటిని ఆహారములోను పానీయాల తయారీ లోనూ విరివిగా ఉపయోగిస్తారు. ప్రతి వంటింట్లో నిమ్మకాయల అవసరత తప్పనిసరిగా ఉంటుంది. నిమ్మలో విటమిన్ సి, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
ఇలా ఎన్నో పోషక పదార్ధాలు ఉన్న నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడంతోపాటుగా ఇంట్లో ఉంచుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు హెల్త్ నిపుణులు. ఇంటిలో క్రిమికీటకాలు బెడదను ఎదుర్కోవటానికి ఒక చిన్న పాత్రలో నిమ్మరసాన్నితీసుకొని ఒక ప్రదేశములో ఉంచితే కీటకాలు ఆప్రాంతం వదిలి వెళ్లిపోతాయి.
ముఖ్యంగా నిద్రంచే ముందు బెడ్రూంలో నిమ్మ ముక్కలను పెడితే అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు. నిమ్మకాయలను రూమ్‌లో పెడితే ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ అవసరం ఉండదు. నిమ్మ వాసనతో గది పరిమళ భరింతం అవుతుంది. నిమ్మరసం నుండి వచ్చే వాసనలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
శ్వాసనాళ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి నిమ్మను రూమ్ లో ఉంచటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. బెడ్రూంలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవ్వడంతో పాటు బాగా నిద్రపడుతుంది. నిమ్మముక్కల నుండి వచ్చే వాసనలు మనస్సును ప్రశాంతంగా ఉంచటంతోపాటు వత్తిడిని తొలగించేందుకు సహాయపడతాయి.
నిమ్మ వాసన వల్ల యాంగ్జైటీ దూరమౌతుంది. అంతేకాకుండా నెగెటివ్ థింకింగ్ ను వదిలిపెట్టి పాజిటీవ్ ఆలోచనలు కలిగేలా చేస్తుంది. దీంతో మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇంట్లో ఉండే ఈగలు, దోమలు, ఇతర కీటలను నివారించే శక్తిసామర్థ్యం నిమ్మరసంలో ఉంది. అందుకే నిమ్మకాయ ముక్కలను బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల, దోమలు, కీటకాలు తొలగిపోయి నిద్రకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. బెడ్రూంలో నిమ్మ ముక్కలను పెట్టడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బెడ్ రూమ్ లో నిద్రించే మంచం వద్ద నిమ్మముక్కలను ఉంచుకోవటం ద్వారా నిద్ర బాగా పట్టటంతోపాటు మరుసటి రోజు మొత్తం చురుకుగా ఉండేలా సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిరోజు బెడ్ రూమ్ లో నిమ్మకాయలను ముక్కలుగా కోసి ఒక ప్లేట్ లో వాటిని ఉంచి మీ బెడ్ రూంలో ఉంచుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.