యోగ చేస్తే డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి: కొత్త రిసెర్చ్ తేల్చేసింది

రెగ్యులర్‌గా యోగా చేసేవాళ్లకు మానసిక ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కానీయండి, పని ఒత్తిడి కానీయండి, ప్రపంచవ్యాప్తంగా Mental Disorders 32శాతం వరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 34కోట్లమందికి Disabilityరావడానికి ప్రధాన కారణం Depressive disorders అని అంటన్నారు పరిశోధకులు. మానసిక రోగాలు మనిషిని శారీరంగా దెబ్బతీస్తాయా? దానికి సమాధానం అవును.
COVID-19 lockdownవల్ల శారీరంగా శ్రమ తగ్గిపోయింది. జనం రోడ్లెక్కలేదు… జిమ్స్, రన్నింగ్, వాకింగ్‌లు లేవు. అందుకే యోగాను నమ్ముకున్నారు. నిజానికి, లాక్‌డౌన్ టైంలో మానసిక సమస్యలకు యోగా మంచి పరిష్కారమంట. డిప్రెషన్ ఉన్నవాళ్లకు చాలా ట్రీట్మెంట్లున్నాయి. కాకపోతే యోగా… నిఖార్సైన్ హోం రెమిడీ. British Journal of Sports Medicineలో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం, yogaరెగ్యులర్‌గా చేస్తే depression,anxiety,bipolar disorderలాంటి మానసిక రుగ్మతల లక్షణాలను చాలావరకు తగ్గిస్తుందంట.
University of South Australiaలో పరిశోధకురాలు Jacinta Brinsleyప్రకారం ” మానిసిక ఇబ్బందులున్నవారికి Exercise ఎప్పుడూ మంచి వ్యూహమే. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొదిస్తుంది.”
డ్రిప్రెషన్‌ను యోగా ఎలా తగ్గిస్తుందంటే?
32 అధ్యయనాల కోసం 1712 మందిని ఎంచుకొన్నారు. వాళ్లలో depression,post-traumatic stress,schizophrenia,anxiety,alcohol dependence, bipolarవంటి మానసిక సమస్యలున్నాయి. వారానికి 1-2 వరకు యోగా సెషన్స్ నిర్వహించారు. అంటే 20 నిమషాల నుంచి 90 నిమాషాల వరకు. ఒక్కొక్కరికి ఒక్కో సెషన్. అలాగని అన్ని రకాల యోగాలను ప్రాక్టీస్ చేయించడం వాళ్ల ఉద్దేశం కాదు. ఎంచుకున్న కొన్ని ఆసనాలనే వాళ్లతో చేయించారు. వాటన్నింటిని వీడియో తీశారు.
రెండున్నర నెలల పాటు ఈ యోగా సెషన్స్‌ను నిర్వహించారు. రిజల్ట్స్‌ను Brinsley’s team అధ్యయనం చేసింది. ఆశ్చర్యంగా self-help treatmentsలతో పోలిస్తే యోగా చేసివాళ్లలో depressive symptoms తీవ్రత చాలా తగ్గిందంట. మానసిక ఒత్తిడిని తట్టుకొనే శక్తి, ధైర్యం వాళ్లకు వచ్చింది. depressive disordersఉన్నవాళ్లకు యోగా ఎక్కువ ప్రయోజనం. schizophrenia, alcohol use disorders ఉన్నవాళ్లకు మాత్రం చాలా తక్కువ ప్రభావం కనిపించింది. అదే post-traumatic stressఉన్నవాళ్లకు యోగా వల్ల పెద్దలా లాభాలేంలేవు. యోగ వాళ్లకు స్వాంతన కలిగించలేకపోయింది.
వారానికి రెగ్యులర్‌గా నాలుగైదుసార్లు, యోగ చేసినవాళ్లలో డిప్రెసన్ తగ్గుతోంది. ఇప్పటిదాకా మానసిక సమస్యలున్నవాళ్లకు ఎక్స్‌ర్‌సైజెస్ గొప్ప పరిష్కారం. శారీరక, మానసిక ఆరోగ్యానికి మించిది. వ్యాయమం చేస్తే బ్రెయిన్‌కు అంటే amygdala,hippocampusకు రక్తప్రసరణ పెరుగుతుంది. ఈ రెండు భాగాలే మన motivation,moods,responsesకు కారణమవుతాయి.
ఎక్స్‌ర్‌సైజెస్‌తో Endorphins రిలీజ్ అవుతాయి. వీటినే హ్యాపీ హార్మెన్స్ అంటారు. దీనివల్ల Central Stress Response System బాగుపడుతుంది. ఎక్స్‌ర్‌సైజెస్‌తోపాటు నిద్రబాగా పడుతుందని
అంటున్నారు సైంటిస్ట్లు. మోడిటేషన్, బ్రీతింగ్ కంట్రోల్ టెక్నిక్ ను పాటిస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.ఐతే, సంప్రదాయ యోగా చాలా మెరుగ్గా పనిచేస్తుందనీ అంటున్నారు.