టిక్ టాక్ లో చేరిన టాప్ సెలబ్రెటీలు… ఫాలో అవుతున్నారా!

టిక్ టాక్ యాప్ లో ఇప్పటివరకు పెద్దగా స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరు జాయిన్ కాలేదు. తక్కువమంది స్టార్ లు మాత్రమే టిక్ టాక్ లో జాయిన్ అయ్యారు. అయితే ఆరుగురు టప్ సెలబ్రెటీలు మాత్రం టిక్ టాక్ యాప్ ను ఫాలో అవుతున్నారు. టిక్ టాక్ యాప్ మొదట సెప్టెంబర్ 2016 లో డౌయిన్ పేరుతో చైనాలో విడుదలైంది. ఆ తర్వాత సంవత్సరానికి ‘టిక్ టాక్’ పేరుతో అంతర్జాతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది.
భారత దేశంలో ఫిబ్రవరి 2019 నాటికి 24 కోట్ల మంది టిక్ టిక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ 75 భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ యాప్ 500 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. ఈ యాప్ ద్వారా సామాజిక మార్పులు కలిగించే చిన్నపాటి వీడియో క్లిప్ లు పాటల రూపంలో ఉంటాయి. ప్రజల్లో చైతన్యం కలిగించేలా పలువురు ఈ యాప్ ద్వారా వీడియోలు రూపొందిస్తున్నారు.
1 దీపికా పదుకోనే
దీపికి పదుకోనే జనవరి నెల మెదట్లో టిక్ టాక్ యాప్ చేరారు. ఆమె ఇటీవల నటించిన చపాక్ సినిమాలోని యాసిడ్ దాడుల గురించి అవగాహనా కలిగించే చిన్న క్లిప్ లను షేర్ చేస్తుంది. యాసిడ్ బాధితురాలైన లక్ష్మి అగర్వాల్ తో నాగిని డాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పటివరకు 4.4 మిలియన్ ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది.
2. కాజోల్
తన్హాజీ ది అన్సంగ్ వారియర్ మూవీ ప్రమోషన్ల సందర్భంగా కాజోల్ టిక్ టాక్ లోకి చేరింది. ఆ మూవీ పోస్టర్ లను షేర్ చేసుకుంది. 2.3 మిలియన్ ఫాలోయింగ్ ఉంది.
3.శిల్ప శెట్టి కుంద్రా
కొత్త సంవత్సరం కౌంట్ డౌన్ సందర్భంగా ఈ యాప్ లో చేరింది. ఈమెకి 5.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. తన రాబోయే చిత్రాలకు సంబంధించిన పోస్టులను, పాత పాటలు వంటి వీడియోలను ఇక్కడ చూడవచ్చు.
4.కార్డి బి
కార్డి బి మ్యూజిక్, ఫన్నీ వీడియోలును చూడాలనుకుంటే టిక్ టాక్ లో ఫాలో కావచ్చు. ర్యాప్ యుద్ధాలు వంటి మ్యూజిక్ వీడియోలను చూడవచ్చు. ఇప్పటి వరకు 1.8 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.
5. పోస్ట్ మలోన్
పోస్ట్ మలోన్ క్లబ్ లో ‘ది ఇట్సీ బిట్సీ స్పైడర్’ పాటకు డాన్స్ చేసిన వీడియోని టిక్ టాక్ లో షేర్ చేశాడు. ఇప్పటి వరకు 2.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
6. నిక్ జోనాస్
నిక్ జోనాస్ హ్యాపీనెస్, ఫన్నీ సీక్పెన్స్ వీడియోలను చేస్తాడు. ఇప్పటి వరకు 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నటి ప్రియాంక చోప్రా భర్త.