Godfather: గాడ్‌ఫాదర్ గర్జన.. మరో 600 స్క్రీన్స్ యాడ్ అయ్యాయిగా!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా వచ్చినా, ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. బాలీవుడ్ జనాలకు ఈ సినిమా బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి, ఈ సినిమాను ప్రదర్శించేందుకు మరో 600 స్క్రీన్లు యాడ్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Godfather: గాడ్‌ఫాదర్ గర్జన.. మరో 600 స్క్రీన్స్ యాడ్ అయ్యాయిగా!

600 Screens Added For Godfather Hindi Belt

Updated On : October 8, 2022 / 11:32 AM IST

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా వచ్చినా, ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాను సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.

GodFather Collections : గాడ్‌ఫాదర్ రెండు రోజుల కలెక్షన్స్.. బాస్ అస్సలు తగ్గట్లేదుగా.. 100 కోట్లు గ్యారెంటీ.

గాడ్‌ఫాదర్ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు ఇతర భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, బాలీవుడ్ జనాలకు ఈ సినిమా బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి, ఈ సినిమాను ప్రదర్శించేందుకు మరో 600 స్క్రీన్లు యాడ్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

GodFather Review : గాడ్‌ఫాదర్ రివ్యూ.. ఇది కదా బాస్ సినిమా అంటే.. బాస్ ఈజ్ బ్యాక్..

ఇటీవల హిందీ బెల్ట్‌లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. నిఖిల్ నటించిన కార్తికేయ-2 సినిమా కలెక్షన్ల మోత మోగించగా, ఇప్పుడు ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ చిరు ‘గాడ్‌ఫాదర్’ కూడా దూసుకెళ్తోంది. చిరంజీవి, సత్యదేవ్, నయనతార ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కేమియో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం మరో మేజర్ అసెట్‌గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.