Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో స్పెషల్ షోలు

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 12:01 PM IST
Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో స్పెషల్ షోలు

Updated On : April 27, 2020 / 12:01 PM IST

రోజూ ఫాలో అయ్యేవే అయినప్పటికీ లాక్ డౌన్ మూమెంట్లో వరుసపెట్టి వస్తున్న అప్‌డేట్స్‌తో బెస్ట్ షోలు మిస్సయిపోవచ్చు. గ్రేట్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే షోలు Netflix, Amazon Prime Video, Disney+ Hotstarలలో అందుబాటులో ఉన్నాయి. chick-flick series, Four More Shots, Please! విజయ్ దేవరకొండ నటించిన World Famous Lover ఓటీటీ ప్లాట్ ఫాంలపై రెడీగా ఉన్నాయి. వీటితో పాటుగా 30 సీజన్ల ఎపిసోడ్లతో The Simpsons అందుబాటులో ఉండటమే కాక 31వ సీజన్ కు ముస్తాబవుతోంది. గంటల కొద్దీ యాప్ లు ఓపెన్ చేసి సెలక్ట్ చేసుకోకుండా మీ కోసం బెస్ట్ షోలను ఇలా ముందుంచుతున్నాం. 

1. – AMAZON PRIME VIDEOలో FOUR MORE SHOTS, PLEASE!- సీజన్ 2

 నలుగురు మహిళలు జీవితాన్ని యథేచ్ఛగా అనుభవించాలనే కోరికలతో గడిపేస్తుంటారు. దామినికి రైటర్ కావాలనే కోరిక. అంజనా తన మాజీ భర్తపై కేసు వేసి పోరాడుతుంటుంది. సిద్ధి, ఉమంగ్‌లు ఎట్టకేలకు తమ ఉనికిని చాటుకునేందుకు చేసే ఫీట్లతో ఎంటర్ టైన్మెంట్ పండిస్తుంటారు. వీటన్నిటినీ నెరవేర్చుకుంటూనే ఆ నలుగురు మహిళలు వారి రిలేషన్‌షిప్స్‌ను కాపాడుకుంటూ ఉంటారు. కొత్త షోలు అన్నింటినీ వెనక్కు నెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుందీ షో.

 

2. AMAZON PRIME VIDEOలో DETECTIVE PIKACHU 

మనమంతా పోక్‌మన్ లాంటి షోలు చూస్తూనే పెరిగాం. అలాంటిది మీకు పికాచు గురించి తెలియదంటే మీరు కచ్చితంగా అబద్ధం చెప్తున్నట్లే. ఓ కుర్రాడు అతని తండ్రి మరణం తర్వాత రైమ్ సిటీకి వెళ్లి పోక్‌మన్ పార్టనర్‌ పికాచుని కలుస్తాడు. వారంతా ఓ టీంగా రెడీ అయి తన తండ్రి మధ్యలో ఆపేసిన కేసును సాల్వ్ చేస్తారు. 

 

3. AMAZON PRIME VIDEOలో GUAVA ISLAND

సినిమా చూడటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి డేవిడ్ గ్లోవర్(చైల్డిష్ గ్యాంబినో) రెండోది రిహానా అనే బ్యాడ్ గర్ల్. ఇదొక మ్యూజికల్ ఫీచర్.. దిజ్ ఈజ్ అమెరికా, డై విత్ యూ, ఫీల్స్ లైక్ సమ్మర్ లాంటి ట్రాక్ లు కచ్చితంగా ఎగ్జైట్ చేస్తాయి. 

 

4. NETFLIXలో వరల్డ్ ఫేమస్ లవర్

దేవరకొండ లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. అర్జున్ రెడ్డి తర్వాత మరోసారి పూర్తి స్థాయి లవర్ గా నటించిన సినిమా. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ కాకపోయినా విజయ్ మార్క్ తో సినిమా నడుస్తోంది. అర్జున్ రెడ్డి చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను కూడా ఇష్టపడతారు. 

5. NETFLIXలో 3 DEEWAREIN 

ఈ టైటిల్ చూసి పట్టించుకోకపోవచ్చు లేదా తెలియకపోవచ్చు. కానీ ఒక సారి ఈ సినిమా చూస్తే మీరు చూసిన వాటిలో టాప్ లిస్ట్ కు చేరడం ఖాయం. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ముగ్గురి కథలపై సినిమా తీసేందుకు ప్రయత్నిస్తుంటూ ఉంటాడు. కథకు తగ్గ పాత్రలతో, సరైన కాన్సెప్ట్ తో తీశారు సినిమా. నాగేశ్ కుకునూర్ కూడా నటించారు. 3 DEEWAREIN నిజంగా ఓ పండగలాంటి సినిమా.  

6. NETFLIXలో THE INNOCENT FILES 

నిజమైన క్రైం లవర్లు నెటిఫ్లిక్స్ లో మిస్ కాకూడదని షో ఇది. ఎనిమిది మంది తప్పుడు సాక్ష్యాల కారణంగా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అంతా అయిపోయినట్లే అనుకుంటున్న సమయంలో లాయర్లు ఇన్వాల్స్ అయి అమాయకులను బయటపడేస్తారు. 

 

7. DISNEY+ HOTSTARలో THE SIMPSONS

సింప్సన్స్ ఓ గ్రేటెస్ట్ అడల్ట్ యానిమేటెడ్ సిరీస్. దాదాపు 30 సీజన్లు నడిచి 31వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ ప్లస్‌లలోనూ టెలికాస్ట్ అయి ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది.