15 ఏళ్ళ ‘ఫీల్ మై లవ్’

సుకుమార్ లాంటి టాలెంటెడ్ పర్సన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న రిలీజ్ అయ్యింది. 2019 మే 7నాటికి ఆర్య విడుదలై 15 సంవత్సరాలు అవుతుంది..

  • Published By: sekhar ,Published On : May 7, 2019 / 08:31 AM IST
15 ఏళ్ళ ‘ఫీల్ మై లవ్’

Updated On : May 7, 2019 / 8:31 AM IST

సుకుమార్ లాంటి టాలెంటెడ్ పర్సన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న రిలీజ్ అయ్యింది. 2019 మే 7నాటికి ఆర్య విడుదలై 15 సంవత్సరాలు అవుతుంది..

ఆర్య.. తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీలు వేరు, ఆర్య వేరు.. ‘ఫీల్ మై లవ్’ అంటూ యూత్‌ని ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్.. నన్ను ప్రేమించక పోయినా పర్వాలేదు, నా ప్రేమను ఫీలైతే చాలు.. అని హీరోయిన్ వెంట పడుతూ, వన్ సైడ్ లవ్ గొప్పతనాన్ని కుర్రకారుకి చెప్పిన ఆర్య, తెలుగు సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్.. సుకుమార్ లాంటి టాలెంటెడ్ పర్సన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న రిలీజ్ అయ్యింది. 2019 మే 7నాటికి ఆర్య విడుదలై 15 సంవత్సరాలు అవుతుంది.

సుకుమార్ ఐడియాలజీ అండ్ టేకింగ్‌కి ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అల్లు అర్జున్ ఆర్యగా అదరగొట్టేసాడు. అను మెహతా, శివ బాలాజీ క్యారెక్టర్స్‌తో పాటు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఆర్య పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. రత్నవేలు ఫోటోగ్రఫీ సినిమాకి అందం తీసుకొచ్చింది. కలెక్షన్‌ల పరంగా రికార్డు క్రియేట్ చేసిన ఆర్య, లవ్ స్టోరీస్‌లో ట్రెండ్ క్రియేట్ చెయ్యడమే కాక, సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసింది. అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్, దిల్ రాజుని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ చేసింది.

ఆర్య రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బన్నీ ఎమోషనల్‌గా ట్వీట్ చేసాడు. ఆర్య నా లైఫ్‌ని మార్చేసింది. ఇప్పటికీ నేనంతే ప్రేమను ఫీలవుతున్నాను. ఆర్య రిలీజ్ అయ్యి 15 ఏళ్ళవుతుందంటే నమ్మలేకపోతున్నా.. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు, సుకుమార్, దిల్ రాజు, దేవి శ్రీ ప్రసాద్, రత్నవేలు.. అందరికీ థ్యాంక్స్.. అంటూ బన్నీ ట్వీట్ చేసాడు.

వాచ్ ఫీల్ మై లవ్ సాంగ్..