రవిబాబు క్వారంటైన్ యానివర్సరీ.. ఇదెక్కడ గోలరా అంటూ తలపట్టుకున్న చలపతి రావు బాబాయ్..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 05:35 AM IST
రవిబాబు క్వారంటైన్ యానివర్సరీ.. ఇదెక్కడ గోలరా అంటూ తలపట్టుకున్న చలపతి రావు బాబాయ్..

Updated On : April 29, 2020 / 5:35 AM IST

క్వారంటైన్ యానివర్శరీ సెలబ్రేషన్..

సీనియర్ నటులు చలపతిరావు కొడుకు, నటుడు.. దర్శకుడైన రవిబాబు ఏది చేసినా చాలా కొత్తగా ట్రై చేస్తుంటడానేది ఆయన చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ సమయంలో మాస్క్‌ల కొరతను తట్టుకునేందుకు సాక్స్‌ని మాస్క్‌లా ఎలా చేసుకోవాలో ఇటీవల ఆయన చేసి చూపించారు. ఇప్పడు మరో కొత్త వీడియోతో అందర్నీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా ఆయన క్వారంటైన్ యానివర్శిరీ జరుపుకున్నారు రవిబాబు. ప్రస్తుతం కరోనా ఇలా ఉంటుంది అని ఒక షేప్‌ని చూపిస్తున్నట్లు, విచిత్ర ఆకారంలో కేక్ చేసుకుని విచిత్రంగా ఏడుస్తూ తిన్నాడు. పక్కనే ఉన్న తండ్రి చలపతిరావుకి కూడా తినిపించబోతే.. ఆయన ఆ వింత చేష్టలకు వీడేంటి ఇలా తయారయ్యాడు.. అనేలా తలపట్టుకుని పక్కకి వెళ్లిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరూ చూసెయ్యండి మరి.