Anil Kapoor : తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులన్నీ డిలీట్ చేసిన ఆ నటుడు.. ఎందుకంటే?
నిన్న మొన్నటి దాకా ఆ నటుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సడెన్‌గా ఆ నటుడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులన్నీ డిలీట్ అయ్యాయి. డిలీట్ చేసారా? అకౌంట్ హ్యాక్ అయ్యిందా?

Anil Kapoor
Anil Kapoor : బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులన్నీ మాయం అవ్వడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ 5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న అనిల్ కపూర్ ఖాతా హ్యాకైందా? లేక ఉద్దేశ పూర్వకంగానే ఆయన డిలీట్ చేసారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Allari Naresh : ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’.. కామెడీ సినిమా కోసం అల్లరి నరేష్..
అనిల్ కపూర్ తన డిస్ ప్లే పిక్చర్‌తో సహా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని పోస్టులన్నీ తొలగించడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనిల్ అల్లుడు ఆనంద్ అహూజా, కూతురు సోనమ్ కపూర్ కూడా ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇదంతా అనిల్ కపూర్ రాబోయే సినిమా ‘యానిమల్’ ప్రమోషన్లో భాగమని కొందరు అనుకుంటున్నారు.
అనిల్ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎక్కువగా తన ఫోటోలు, జిమ్ వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అవన్నీ డిలీట్ అయ్యాయి. వీటిని అనిల్ కపూర్ స్వయంగా డిలీట్ చేసారా? లేక ఆయన అకౌంట్ హ్యాకైందా? అనేది కూడా తెలియట్లేదు. ఈ విషయంలో అనిల్ బ్రదర్ బోనీ కపూర్ మాట్లాడుతూ ఎందుకు ఇలా చేసాడో తెలియదు కానీ.. ఏదో చేయబోతున్నట్లు మాత్రం చెప్పాడని వెల్లడించారు. అదేంటో తెలిసే వరకు తను వెయిట్ చేస్తానని అన్నారు.
అనిల్ కపూర్ రీసెంట్‌గా ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కనిపించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆదిత్యకపూర్‌తో చేసిన ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌లో శోభిత ధూళిపాళతో కలిసి రొమాంటిక్ పాత్రలో నటించారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో డిసెంబర్ 1 న థియేటర్లలోకి వస్తున్న’యానిమల్’ సినిమాలో కూడా అనిల్ కపూర్ నటిస్తున్నారు.

Anil Kapoor 1

Anil Kapoor 2