Mithun Chakraborty : గుండెనొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Mithun Chakraborty
Mithun Chakraborty : ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి గుండెపోటుతో కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు అత్యవరస చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Shraddha Das : తడిసిన కురులతో శ్రద్ధాదాస్ అందాల ఆరబోత..
మిథున్ చక్రవర్తి 1976 లో ‘మృగయా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. మొట్టమొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్నారు. ‘డిస్కో డాన్సర్’ సినిమా మిథున్‌కి మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1990 చివర నుండి గురు, గోల్ మాల్ 3, హౌస్ ఫుల్ 2, OMG-ఓ మైగాడ్ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిచారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ లో కూడా మిథున్ మెప్పించారు. కాగా ప్రస్తుతం మిథున్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెనొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Naa Saami Ranga : ‘నా సామిరంగ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?
2009 లో మిథున్ ఇమ్రాన్ ఖాన్, శ్రుతి హాసన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లక్’ లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ప్రమాదంలో గాయపడ్డారు. వెన్నుముకకు గాయమై చికిత్స తీసుకున్నారు. దాని ప్రభావంతో 2016 లో కూడా చికిత్స తీసుకున్నారు. అనారోగ్య కారణాలతోనే మిథున్ 2016 లో రాజ్యసభకు రాజీనామా చేసారు. ఆ తర్వాత ఒక డాన్స్ రియాలిటీ షో హోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.