Suhas : హ్యాట్రిక్ ఇచ్చారు.. ఇంకో హ్యాట్రిక్ ఇస్తారని.. సుహాస్ ఎమోషనల్ లెటర్..

వరుసగా మూడు సినిమాల హిట్స్ తో హ్యాట్రిక్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఓ ఎమోషనల్ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సుహాస్.

Suhas : హ్యాట్రిక్ ఇచ్చారు.. ఇంకో హ్యాట్రిక్ ఇస్తారని.. సుహాస్ ఎమోషనల్ లెటర్..

Actor Suhas shares a Thank you Note to Audience for Hat trick Success with Ambajipeta Marriage Band Movie

Updated On : February 9, 2024 / 7:42 PM IST

Suhas : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి హిట్ కొట్టాడు. తర్వాత విలన్ గా కూడా మెప్పించాడు. రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా వరుసగా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ విజయాలు అందుకుంటున్నాడు సుహాస్.

ఇటీవలే సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు'(Ambajipeta Marriage Band) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఫిబ్రవరి 2న రిలీజయిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించింది. సుహాస్ మరోసారి నటుడిగా ప్రూవ్ చేసుకొని హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమా ఇప్పటికే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా హిట్ అయినందుకు, వరుసగా మూడు సినిమాల హిట్స్ తో హ్యాట్రిక్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఓ ఎమోషనల్ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సుహాస్.

Also Read : Rakul Preet Singh : ఈ నెలలోనే రకుల్ పెళ్లి? మోదీ చెప్పారని వెడ్డింగ్ ప్లేస్ మార్చుకున్నారా? అక్కడే ఎందుకు?

ఈ లెటర్ లో సుహాస్.. అందరికి నమస్కారం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాని మేము అనుకున్నట్లుగా ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ కి కామెంట్స్ పెట్టడం దగ్గరనుంచి ఇప్పుడు బుక్ మై షోలో టికెట్స్ కొనే వరకు, నన్ను దగ్గరికి తీస్కొని ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిది. నటుడిగా నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు, నా స్థాయిలో కథలను ఎంచుకుని మీ ముందుకు తీసుకురావడమే నా చిన్న ప్రయత్నం. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు వాటికి ఉదాహరణలు. వచ్చే నెలల్లో నేను కథానాయకుడుగా మీ ముందుకి రాబోయే ప్రసన్న వదనం, దిల్ రాజు గారు నిర్మాతగా సందీప్ రెడ్డి బండ్ల ప్రాజెక్ట్, మరియు కేబుల్ రెడ్డి సినిమాలతో మీరు థియేటర్ కి వచ్చి హాయిగా నవ్వుకొని ఆస్వాదించే ఇంకొక మూడు మంచి సినిమాలతో మీ ముందుకి రాబోతున్నాను. హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మరొక హ్యాట్రిక్ ఇస్తారు అని నా ప్రయత్నం నేను చేస్తూనే, మీ ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని తెలిపాడు.

ప్రస్తుతం సుహాస్ రాసిన ఈ లెటర్ వైరల్ గా మారింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఈ రేంజ్ లో దూసుకుపోవడం అంటే మాటలు కాదు. ఎంతో కష్టపడితే కానీ ఈ సక్సెస్ రాదు. ఇందుకు అంతా సుహాస్ ని అభినందిస్తున్నారు. ఇక సుహాస్ చేతిలో హీరోగానే అరడజను సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఇంకా సినిమాలు చేస్తున్నాడు.