Suman : త్రిష కోసం సుమన్.. పాత పద్దతిలో కొత్త సినిమా ప్రారంభం..
గతంలో పాటల రికార్డింగ్ తో సినిమాకు శ్రీకారం చుట్టేవారు. మధ్యలో ఆ ఆనవాయితీ పోయినా ఇటివల మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రాన్ని కీరవాణి సారద్యంలో పాటల రికార్డింగ్ తోనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

Actor Suman will Play a Key Role in Small Movie Titled Trisha
Suman : సీనియర్ నటుడు సుమన్ ఇప్పుడు అడపాదడపా పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. పలు చిన్న సినిమాల్లో కూడా నటిస్తూ చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారు సుమన్. తాజాగా త్రిష అనే ఓ సినిమాలో నటించబోతున్నారు. యువ దర్శకుడు ఆర్.కె గాంధీ దర్శకత్వంలో సీనియర్ హీరో సుమన్ ప్రధానపాత్రలో, కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర నటీనటులుగా ‘త్రిష’ అనే సినిమా మొదలైంది. ‘సంభవామి యుగే యుగే’ క్యాప్షన్ తో టైటిల్ లాంచ్ చేశారు.
గతంలో పాటల రికార్డింగ్ తో సినిమాకు శ్రీకారం చుట్టేవారు. మధ్యలో ఆ ఆనవాయితీ పోయినా ఇటివల మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రాన్ని కీరవాణి సారద్యంలో పాటల రికార్డింగ్ తోనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్నేహాలయం క్రియేషన్స్- బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం – ఈశ్వర్ నాగనాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ త్రిష సినిమా కూడా యువ సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా సంగీతంలో యువ గాయకుడు సాయి చరణ్ పాడైన పాటతో రికార్డింగ్ చేసి మొదలుపెట్టారు.
ఇక ఈ త్రిష సినిమా ఈ నెల 14 నుంచి హైదరాబాద్, కర్ణాటకలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్టపన్నాగాలను ఎలా అరికట్టాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.