Arun Ram Gowda : అయోధ్య రాములవారి సమక్షంలో పెళ్లి చేసుకుంటానంటున్న నటుడు
కన్నడ నటుడు రామ గౌడ-సౌందర్యల నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే రామ గౌడ ఎక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తెలుసా?

Arun Ram Gowda
Arun Ram Gowda : నటుడు రామ గౌడ త్వరలో ఓ ఇంటివాడవుతున్నారు. ఐశ్వర్య అనే అమ్మాయితే నిశ్చితార్థం జరిగింది. పదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది.
అరుణ్ రామ్ గౌడ కన్నడ రియాలిటీ షో ‘ప్యాతే మండి కడిగ్ బండ్రు’ ద్వారా పాపులర్ అయ్యారు. 2015 లో ‘ముద్దు మనసే’ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ నటుడు ఐశ్వర్యతో నిశ్చితార్థం చేసుకున్నారు. గేలెయరా బలగ థియేటర్ ట్రూప్‌లో చేరినపుడు ఇద్దరు ప్రేమలో పడ్డారట. కెరియర్లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. చివరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు కుటుంబాల పెద్దలు సంతోషంగా ఉన్నారట. ఈ ఏడాది చివరలో వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తోంది.
Utsavam Teaser : కళాకారుడు చనిపోవచ్చు కానీ.. కళ చనిపోకూడదు.. ‘ఉత్సవం’ టీజర్ చూశారా?
ఇక వీరి పెళ్లి ఎక్కడ జరగబోతోందన్నదే కాస్త ఆసక్తికరంగా మారింది. చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో తమకు ఇష్టమైన చోట పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే రామ గౌడ రామభక్తుడట. ఇటీవలే ప్రారంభమైన అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని సమక్షంలో తన వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. అదన్నమాట విషయం. ఇక దర్శకుడిగా కూడా మారుతున్న ఈ నటుడు వచ్చే ఆరు నెలల్లో సినిమా డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.