Pragathi Mahavadi : మీరు గ్రేట్ అండి.. 50 ఏళ్ళ వయసులో భారత్ కి సిల్వర్ మెడల్ తెచ్చిన నటి..
ప్రగతి ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ లెవల్ లో భారతదేశానికి పతకం తెచ్చింది.(Pragathi Mahavadi)
Pragathi Mahavadi
Pragathi Mahavadi : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్ళ నుంచి మెప్పిస్తుంది ప్రగతి. కానీ గత కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెయిట్ లిఫ్టింగ్ లో అనేక కాంపిటీషన్స్ లో పతకాలు సాధిస్తుంది. తన వెయిట్ లిఫ్టింగ్ జర్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది ప్రగతి. ఇప్పటికే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవల్లో ఎన్నో పతకాలు సాధించిన ప్రగతి ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ లెవల్ లో భారతదేశానికి పతకం తెచ్చింది.(Pragathi Mahavadi)
2025 ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో మన ఇండియా తరపున ప్రగతి కూడా పాల్గొంది. ఈ పోటీల్లో ప్రగతి వివిధ విభాగాలలో వెయిట్ లిఫ్టింగ్ చేసింది. మెయిన్ 84 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో ప్రగతి ఏకంగా సిల్వర్ మెడల్ సాధించింది. అంతే కాకుండా డెడ్ లిఫ్ట్, బెంచ్, స్క్వాడ్ విభాగాల్లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ పతకాలు సాధించింది ప్రగతి.
Also Read : Nandamuri Hero : అప్పట్లో చిరంజీవితో నటించిన నందమూరి హీరో.. 35 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ.. ఈయనని గుర్తుపట్టారా?
దీంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు, సినిమా సెలబ్రిటీలు ప్రగతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెని చూసి గర్విస్తున్నారు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు వెయిట్ లిఫ్టింగ్ లో తన కెరీర్ ఏర్పరుచుకొని ఇలా ఇంటర్నేషనల్ లెవల్లో దేశానికి పతకాలు తీసుకురావడం నిజంగా అభినందనీయం. దీంతో ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రగతి కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో తెలుపుతూ తనకు ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ ఉదయ్ కి కృతజ్ఞతలు తెలిపింది.
