Pragathi: ‘నాగిని’ పాటకు ప్రగతి ఇరగదీసే స్టెప్పులు.. వీడియో వైరల్‌

తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్ర‌గ‌తికి డ్యాన్స్ లోనూ మంచి ప్రావిణ్యం ఉంది.

Pragathi: ‘నాగిని’ పాటకు ప్రగతి ఇరగదీసే స్టెప్పులు.. వీడియో వైరల్‌

Pragathi

Updated On : December 15, 2021 / 5:48 PM IST

Pragathi: తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్ర‌గ‌తికి డ్యాన్స్ లోనూ మంచి ప్రావిణ్యం ఉంది. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చిన ప్రగతి ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో త‌న‌ వ‌ర్కవుట్ స్టిల్స్ తో పాటు పాటలకు మాస్ స్టెప్పులేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది.

Sai Pallavi: బ్యూటీ విత్ నాచురాలిటీ సాయిపల్లవి.. గ్యాలరీ

ఫిట్నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి వర్క్ ఔట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్‌ చేసే వర్కౌట్‌ వీడియోలు వైరల్‌ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక డాన్స్ వీడియోలైతే చేసిన ప్రతి వీడియో నెటిజన్లను ఫిదా చేసిందే. తాజాగా ప్ర‌గ‌తి నాగిని పాటకి ఇర‌గ‌దీసే స్టెప్పులేసి అద‌ర‌గొట్టింది. ప్ర‌గ‌తి ఈ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వీడియో తెగ వైరల్ అవుతుంది.

Sukumar Special Song’s: సుకుమార్ స్పెషల్ సాంగ్స్ అంటే కిర్రాక్కే!

‘నేను చేసే ప్రతి పనిలో ఆనందాన్ని సృష్టిస్తాను’అని క్యాప్షన్‌ ఇస్తూ చేసిన ఈ వీడియోలో ప్రగతి ఊరమాస్ స్టెప్పులేస్తూ అదరగొట్టింది. నటి ప్రగతికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం.. అలాగే ఫిట్ నెస్ మీది సరైన శ్రద్ద చూపడం వంటివి ఇష్టమని పలు సందర్భాల్లో ప్రగతి చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ గురించి తెలియజేస్తూ మహిళల్లో స్పూర్తి నింపుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపగా ఇలా ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలతో రెచ్చిపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)