Supritha : సూసైడ్ చేసుకున్న నిర్మాత.. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ సుప్రీత ఎమోషనల్ పోస్ట్..
తాజాగా నటి సురేఖవాణి కూతురు సుప్రీత KP చౌదరి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Actress Supritha Emotional Post on Producer KP Chowdary
Supritha : టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ KP చౌదరి సూసైడ్ చేసుకొని మరణించారు. గోవాలో ఆయన సూసైడ్ చేసుకొని మరణించినట్టు పోలీసులు తెలిపారు. సరైన కారణాలు ఇంకా తెలియదు కానీ ఆర్ధిక ఇబ్బందులతోనే నిర్మాత KP చౌదరి సూసైడ్ చేసుకున్నాడని సమాచారం. అయితే గతంలో 2023లో KP చౌదరి పేరు డ్రగ్స్ కేసులో బయటకు వచ్చింది. పోలీసులు KP చౌదరిని అరెస్ట్ కూడా చేసారు. ఈ కేసులో KP చౌదరి టాలీవుడ్ కు చెందిన పలువురికి డ్రగ్స్ అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది.
అందులో పలువురు యూట్యూబ్, సోషల్ మీడియా బ్యాచ్ కూడా ఉన్నట్టు పలువురి పేర్లు వచ్చాయి. అయితే తాజాగా నటి సురేఖవాణి కూతురు సుప్రీత KP చౌదరి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. KP చౌదరితో దిగిన ఫోటోని షేర్ చేసి.. సమాజం ఫెయిల్ అయింది. నిన్ను ఎప్పటికి మిస్ అవుతాను. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. నీ బాధలు నేను వినడానికి లేకుండా చేసావు కదా అన్న. ఈ చెల్లి నీ కోసం ఎప్పుడూ ఉంది. వెనక్కి రా అన్న. మిస్ యు KP అన్న. నువ్వు ఎక్కడ ఉన్నా టైగర్ అంటావుగా. లవ్ యు అన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Also Read : KP Chowdary : సూసైడ్ చేసుకున్న టాలీవుడ్ నిర్మాత.. గతంలో డ్రగ్స్ కేసులో పెట్టుబడి..
దీంతో సుప్రీత పోస్ట్ వైరల్ గా మారింది. అయితే పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి, పలు చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన KP చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక మళ్ళీ సినీ పరిశ్రమలో కనపడలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, అందువల్లే సూసైడ్ చేసుకున్నాడని సమాచారం. ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి సూసైడ్ చేసిన వ్యక్తిపై నటి సుప్రీత ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో వైరల్ గా మారింది.
Also Read : Bunny Vasu : మళ్ళీ జనసేన నుంచి పోటీ గురించి మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. పవన్ గారి దగ్గర అలా పనిచేస్తే..
ఇక సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే పలు టీవీ షోలు, సోషల్ మీడియాతో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అమర్ దీప్ తో కలిసి సుప్రీత ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.