KP Chowdary : సూసైడ్ చేసుకున్న టాలీవుడ్ నిర్మాత.. గతంలో డ్రగ్స్ కేసులో పెట్టుబడి..
తాజాగా నిర్మాత KP చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు.

Tollywood Producer KP Chowdary Passed away in Goa
KP Chowdary : తాజాగా టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ KP చౌదరి సూసైడ్ చేసుకొని మరణించారు. గతంలో 2023లో KP చౌదరి పేరు డ్రగ్స్ కేసులో బయటకు వచ్చింది. పోలీసులు KP చౌదరిని అరెస్ట్ కూడా చేసారు. టాలీవుడ్ కు చెందిన పలువురికి కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. పోలీసులకు కొంతమంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లను KP చౌదరి చెప్పినట్టు అప్పుడు పోలీసులు ప్రకటించారు.
అయితే తాజాగా నిర్మాత KP చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో పలు సినిమాలను రిలీజ్ చేసి, పలు చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన KP చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. ఆ తర్వాత ఆయన పేరు కూడా ఎక్కడా వినపడలేదు. తాజాగా గోవాలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతోనే కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. నేడు ఉదయం పోలీసులు వెళ్లేసరికి విగతజీవిగా పడి ఉన్నారు కేపీ చౌదరి.
Also Read : Bunny Vasu : మళ్ళీ జనసేన నుంచి పోటీ గురించి మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. పవన్ గారి దగ్గర అలా పనిచేస్తే..
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించనున్నారు. KP చౌదరి మరణంపై టాలివుడ్ లో ఇంకా ఎవరూ స్పందించలేదు. ఆయన సోసైటీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.