Adivi Sesh : మృణాల్ ఠాకూర్, అడివి శేష్ కు షూటింగ్ లో గాయాలు..
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా డెకాయిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Adivi Sesh
Adivi Sesh : సినీ సెలబ్రిటీలు షూటింగ్స్ లో అప్పుడప్పుడు గాయాల పాలవుతారని తెలిసిందే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో గాయాలు అవ్వడం మామూలే. తాజాగా హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డెకాయిట్ షూటింగ్ లో గాయపడ్డారని సమాచారం.
Also Read : Kohinoor : కోహినూర్ డైమండ్ మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలి.. పవన్ వ్యాఖ్యలు వైరల్..
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా డెకాయిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లవ్, యాక్షన్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా యాక్షన్ సన్నివేశాల్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కింద పడి గట్టిగానే గాయాలు అయినట్టు తెలుస్తుంది. గాయాలు అయినా షూటింగ్ పూర్తిచేసి హాస్పిటల్ కి వెళ్లారని సమాచారం.