Aha : ఆహాలో హై-ఎనర్జీ డాన్స్ రియాలిటీ షో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Aha OTT Announces New Dance Reality Show Premiering January 2025
తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకుపోతుంది. మూవీస్, వెబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా.. ఓటీటీ చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త ప్రోగ్రామ్స్‌ను రూపొందిస్తూ డిజిటల్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఈ క్రమంలోనే మరో షోతో ముందుకు రాబోతుంది.
హై-ఎనర్జీ డాన్స్ రియాలిటీ షో ను ప్రారంభించబోతుంది. జనవరి 2025లోనే దీన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఎంతో ప్రతిభావంతులైన డాన్సర్‌లు, సెలబ్రిటీలు, అత్యంత ప్రసిద్ధ హోస్ట్‌తో ఈ షో ఉంటుందని చెప్పింది. నటన, కొరియోగ్రఫీలో అనుభవం ఉన్న నటి న్యాయనిర్ణేతగా ఉండనున్నట్లు తెలిపింది.
Dilruba Teaser : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ వచ్చేసింది..
ఈ డ్యాన్స్ రియాలిటీ షోలో హిప్-హాప్, క్లాసికల్‌లతో పాటు అన్ని రకాల డ్యాన్సింగ్ ప్రదర్శనలు డ్యాన్సర్లు ఇవ్వనున్నారని పేర్కొంది. మరిన్ని వివరాలను అతి త్వరలోనే తెలియజేయనున్నట్లు చెప్పింది.