Aishwarya Rajesh: ఏడాది నుంచి ఒక్క ఆఫర్ లేదు.. మేకర్స్ నమ్మడం లేదు.. ఐశ్వర్య ఎమోషనల్ కామెంట్స్
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తరువాత కూడా ఆఫర్స్ రాకపోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh).
Aishwarya Rajesh shocking comments about not getting opportunities in star heroes films.
- సంక్రాంతికి వస్తున్నాం హిట్ తరువాత నో ఆఫర్స్
- స్టార్స్ సినిమాల్లో అవకాషాల కోసం చూసిన ఐశ్వర్య
- మేకర్స్ కి నమ్మకం రావడం లేదంటూ కామెంట్స్
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అవడానికి తెలుగు అమ్మాయే అయినా తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. చిన్న వయసులోనే పెద్ద పెద్ద పత్రాలు చేసి మెప్పించింది. అయినా కూడా కెరీర్ లో అసలైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. తాజాగా ఈ బ్యూటీ తెలుగులో నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించి ఒక రేంజ్ లో మెప్పించింది.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా తరువాత ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కి తెలుగు నుంచి భారీ ఆఫర్స్ క్యూ కడతాయి అని చాలా మంది అనుకున్నారు. అలాగే ఆడియన్స్ కూడా ఫీలయ్యారు. కానీ, దానికి పూర్తిగా ఉంది సిచువేషన్. ఏడాదిగా ఐశ్వర్య రాజేష్ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. అసలు అవకాశాలు రాలేదు.
Sushmita Konidela: రామ్ చరణ్ తో నెక్స్ట్ సినిమా.. క్యూలో ఉన్నాను.. సుష్మిత ఆసక్తికర కామెంట్స్
అయితే, ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య రాజేష్ స్పందించింది. ఒకింత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సాధించింది. ఆ తరువాత నాకు వరుస ఆఫర్స్ వస్తాయని అనుకున్నాను. కానీ, ఆలా జరగలేదు. స్టార్స్ సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తాయని అనుకున్నాను. కానీ, మేకర్స్ కి నమ్మకం రావడం లేదు. తాను చేయగలదా అనే అనుమానంలోనే ఉండిపోయారు.
కానీ, నాకు వస్తున్న అవకాశాలు చేసుకుంటూ వెళ్తున్నాను. వాటిలో నాకు నచ్చిన కథలను చేస్తున్నాను. ఇదే నాకు సంతోషంగా ఉంది. నాకు 24 ఏళ్ళ వయసులోనే ఇద్దరు పిల్లల తల్లిగా నటించి మెప్పించాను. భవిష్యత్తులో మంచి సినిమాలు చేయడానికి కష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.
