RRR : RRR లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన అలియా.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!

ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఈ పేరు దేశం వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇక హీరోయిన్లుగా..

RRR : RRR లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన అలియా.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!

alia bhatt surprisingly got a chance in rrr movie

Updated On : March 12, 2023 / 11:52 AM IST

RRR : ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఈ పేరు దేశం వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ ప్రీ ఇండిపెండెన్స్ కథాంశంతో వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ చిత్రం అనౌన్స్‌మెంట్ తోనే భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. హీరోయిన్లుగా బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ ని ఎంపిక చేసుకున్నారు.

Oscar 2023 : 62 ఏళ్ళ ట్రెడిషన్‌ని బ్రేక్ చేసిన ఆస్కార్.. రంగు మార్చుకున్న కార్పెట్!

అయితే ఒలివియా మోరిస్ కంటే ముందు ఆ పాత్ర కోసం డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేసుకున్నాడు రాజమౌళి. కానీ ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ వల్ల డైసీ ఎడ్గర్ RRR నుంచి తప్పుకుంది. అలా ఒలివియా ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యింది. కాగా అలియా భట్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. బాహుబలి తరువాత అలియా, రాజమౌళిని ఒక ఎయిర్ పోర్ట్ లో చూసిందట. దీంతో రాజమౌళితో వస్తుందేమో అనే ఆశతో మాట్లాడానికి ఆయన దగ్గరకు వెళ్లిందట. అలాగే వెళ్లి రాజమౌళితో తనని తాను పరిచయం చేసుకొని, మీతో వర్క్ చేయాలనీ ఉంది అంటూ వెల్లడించింది.

RRR : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా?

అయితే ఆ మాటలు పూర్తి అవ్వగానే రాజమౌళి.. ఆల్రెడీ నేను నీ కోసం ఒక పాత్ర రాసుకున్నా, త్వరలో నేనే నిన్ను సంప్రదించాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఇక ఆ మాటలకి అలియా షాక్ కి గురైందట. ఆ తరువాతే రాజమౌళి RRR తో అలియాని సంప్రదించడం, ఆమె ఆ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మరికొద్ది గంటల్లో ఈ వేడుక మొదలు కానుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటలకు మొదలు కాబోతుంది.