Aa Okkati Adakku Trailer : ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ రిలీజ్.. పెళ్లి ఎప్పుడని అడిగేవారి కోసం కొత్త చట్టం..
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Allari Naresh Faria Abdullah Aa Okkati Adakku trailer released
Aa Okkati Adakku Trailer : అల్లరి నరేష్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ ఓ కామెడీ మూవీని సిద్ధం చేసారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
పెళ్లి కోసం ఎదురు చూస్తున్న హీరోకి ఒక మ్యాచ్ కూడా సెట్ అవ్వకపోతే.. అతని జీవితం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనేది కామెడీగా ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. అలాగే ఓ మెసేజ్ కూడా ఈ మూవీలో ఉండబోతుందని నరేష్ చెప్పుకొచ్చారు. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తంగా నరేష్ మార్క్ అల్లరి.. అలాగే కొంచెం కమర్షియలిటీ కూడా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
Also read : Satyabhama : రిలీజ్ డేట్ ప్రకటించిన సత్యభామ.. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ మాస్..
మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెన్నల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.