Vedaraju Timber : టాలీవుడ్ లో విషాదం.. అల్లరి నరేష్ తో సూపర్ హిట్ సినిమా తీసిన నిర్మాత కన్నుమూత..
నేడు ఉదయం టాలీవుడ్ లో విషాదం నెలకొంది.

Allari Naresh Hit Movie Producer Vedaraju Timber Passed away with Health Issues
Vedaraju Timber : తాజాగా నేడు ఉదయం టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నేడు తెల్లవారు జామున మరణించారు.
కన్‌స్ట్రక్షన్స్ బిజినెస్ చేస్తూ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు వేదరాజు టింబర్. అల్లరి నరేష్ తో మడతకాజా, సంఘర్షణ సినిమాలు తీశారు. మడతకాజా హిట్ అవ్వగా సంఘర్షణ పరాజయం పాలైంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. 2021లో హీరో శ్రీవిష్ణుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
నేడు ఉదయం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు వేదరాజు టింబర్. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వేదరాజు టింబర్ అంత్యక్రియలు నేడే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.