Naa Saami Ranga : నాగార్జున సినిమాలో అల్లరి నరేష్.. స్నేహితుడు పాత్ర కోసమేనా..?

నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నాడా..? ఆ పాత్రలోనే నరేష్..

Naa Saami Ranga : నాగార్జున సినిమాలో అల్లరి నరేష్.. స్నేహితుడు పాత్ర కోసమేనా..?

Allari Naresh is casting for Nagarjuna Naa Saami Ranga

Updated On : September 7, 2023 / 3:59 PM IST

Naa Saami Ranga : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) తన పుట్టినరోజు నాడు 99వ సినిమా అంటూ ‘నా సామిరంగ’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ తో పాటు గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేసి అక్కినేని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాకుండా రిలీజ్ సమయాన్ని కూడా ప్రకటించేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశాడు. దీంతో ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ మూవీలో నాగార్జునతో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడట.

KH233 : మెషిన్ గన్స్‌తో కమల్ హాసన్ స్పెషల్ ట్రైనింగ్.. వీడియో వైరల్..

ఈ సినిమాలో నాగార్జునతో పాటు సాగే మరో ముఖ్య పాత్ర ఉంటుందట. అందుకోసం అల్లరి నరేష్ (Allari Naresh) ని సంప్రదించారట. నరేష్ కూడా ఇందుకు ఒకే చెప్పినట్లు సమాచారం. తను చేస్తున్న మూవీని సైతం పక్కన పెట్టి ముందుగా ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చాడట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో ఈ వార్త వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రం మలయా సూపర్ హిట్ మూవీ ‘పోరింజు మరియం జోస్’ (Porinju Mariam Jose) కి రీమేక్ అని సమాచారం.

Kalki 2898 AD : ప్ర‌భాస్ కల్కి 2898 AD లో రామ్‌గోపాల్ వ‌ర్మ‌..? ఇప్ప‌టికే ఆర్‌జీవీ షూటింగ్ పార్ట్ పూర్తి..?

ఈ సినిమా కథ ముగ్గురు స్నేహితులు మధ్య సాగుతుంది. వారిలో ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్. మెయిన్ హీరో నాగార్జున కాగా స్నేహితుడు పాత్ర కోసమే అల్లరి నరేష్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్ పాత్ర కోసం ఆషిక రంగనాధ్, మానసవారణాసి పేరులు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి నిజంగా నాగ్ చేస్తున్నది ఆ మూవీ రీమేక్‌నా? లేదా? అనేది తెలియదు. కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ డైరెక్ట్ చేయబోతున్నాడు. చిట్టూరి శ్రీనివాస ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.