Ugram Movie: ఉగ్రం ట్రైలర్ అప్డేట్ తెచ్చిన గాలి శీను.. అల్లరోడి ప్రమోషన్ భలే ఉందిగా!
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ‘ఉగ్రం’ సినిమా రిలీజ్ కు రెడీ కావడంతో ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Allari Naresh Promotes Ugram In Gaali Sreenu Getup
Ugram Movie: కామెడీ హీరోగా అల్లరి నరేశ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకున్నాడు. అయితే రొటీన్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకబడిపోయి, ఆ తరువాత వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవడంతో కామెడీ సినిమాలను తగ్గించేశాడు ఈ హీరో. ఇక ఇప్పుడు వరుసగా సీరియస్ మూవీలు చేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాడు. నాంది, ఇట్లు మారుడుమిల్లి ప్రజానీకం వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు అల్లరి నరేశ్.
Allari Naresh: కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’
ఇప్పుడు ఇదే కోవలో మరోసారి సీరియస్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. నాంది చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో ‘ఉగ్రం’ అనే సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేశ్. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Ugram Movie: ఉగ్రం ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను తీసుకొస్తున్న అల్లరి నరేష్
ఈ ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను అల్లరి నరేశ్ ‘గమ్యం’ సినిమాలోని గాలి శ్రీను గెటప్‌లో చేయడంతో ఈ అనౌన్స్‌మెంట్ వీడియోకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ అందించారు. ఇక ఉగ్రం సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అల్లరి నరేశ్ కనిపిస్తుండగా, ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా అల్లరోడు తన సినిమా ప్రమోషన్స్‌ను చేస్తున్న తీరుకు ఆడియెన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.