Allari Naresh: నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేశ్.. ఎందుకో తెలుసా?
అల్లరి నరేశ్ తాను నాలుగు రోజుల్లోనే 500 సిగరెట్లు తాగానని చెప్పడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఆయన అలా ఎందుకు చేశాడో తెలుసుకుని అభిమానులు ఫిదా అవుతున్నారు.

Allari Naresh Smokes 500 Cigarettes In 4 Days For Ugram Movie
Allari Naresh: యంగ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నాంది’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరు చేతులు కలపడంతో, ఉగ్రం మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Allari Naresh: కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’
ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ‘ఉగ్రం’ మూవీపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు హీరో అల్లరి నరేశ్. ఈ క్రమంలోనే తాజాగా ఉగ్రం మూవీకి సంబంధించి ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ఉగ్రం సినిమా షూటింగ్ సమయంలో అల్లరి నరేశ్ కేవలం నాలుగు రోజుల్లోనే 500 సిగరెట్లు తాగినట్లుగా తెలిపాడు. ఈ విషయాన్ని తెలుసుకుని అందరూ అవాక్కవుతున్నారు.
Allari Naresh: అక్కినేని హీరో చేతుల మీదుగ ఉగ్రం టీజర్ లాంచ్
అయితే, ఉగ్రం సినిమాలోని ఓ సీన్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం తాను ఇలా 500 సిగరెట్లు తాగినట్లుగా అల్లరి నరేశ్ తెలిపాడు. కాగా, అలా చేయడంతో దగ్గు, జ్వరంతో పాటు ఆరోగ్యం కూడా పాడయ్యిందని ఆయన తెలిపాడు. సినిమాలోని సీన్ కోసం ఇంత రిస్క్ చేశాడని తెలుసుకుని నెటిజెన్లు అల్లరి నరేశ్ డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఉగ్రం సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేస్తున్నారు. మిర్నా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. మే 5న ఉగ్రం సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.