Allu Arjun : పుష్ప ఎఫెక్ట్ తగ్గేదేలే.. ఇండియన్ అఫ్ ది ఇయర్.. అల్లు అర్జున్ కి మరో అవార్డు..
తాజాగా ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో CNN News18 ఇచ్చే Indian Of The Year అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ అవార్డుకు రాజమౌళి, అలియాభట్, వివేక్ అగ్నిహోత్రి, కార్తీక్ ఆర్యన్ నామినేట్ అవ్వగా...........

Allu Arjun gets indian of the year award in entertainment category from cnn news
Allu Arjun : పుష్ప సినిమా దేశమంతటా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప సినిమా అల్లు అర్జున్ స్టార్ డమ్ ని పెంచేసింది. పుష్ప సాంగ్స్, సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో అల్లు అర్జున్ కి బాగా గుర్తింపు లభిస్తుంది. ఇక పుష్ప సినిమా వరుసగా అవార్డులు సాధిస్తుంది. ఇటీవలే చాలా విభాగాల్లో సైమా, ఫిలింఫేర్ అవార్డులని సాధించింది పుష్ప సినిమా.
తాజాగా ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో CNN News18 ఇచ్చే Indian Of The Year అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ అవార్డుకు రాజమౌళి, అలియాభట్, వివేక్ అగ్నిహోత్రి, కార్తీక్ ఆర్యన్ నామినేట్ అవ్వగా అల్లు అర్జున్ కి ఈ అవార్డు వరించింది. బుధవారం సాయంత్రం ఈ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. CNN News18 ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అల్లు అర్జున్ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అందుకున్నారు.
Niharika Konidela : టర్కీలో బికినీతో రచ్చ చేస్తున్న నిహారిక.. మరోసారి సోషల్ మీడియాలో నిహారిక వైరల్..
దీంతో మరోసారి దేశవ్యాప్తంగా బన్నీ పేరు మారుమ్రోగుతుంది. ఈ అవార్డు అందుకున్నందుకు అభిమానులు, పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ కి అభినందనలు తెలుపుతున్నారు.