‘‘పాలకొల్లు To పద్మశ్రీ ’’ : అరుదైన ఫోటో షేర్ చేసిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అరుదైన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..

‘‘పాలకొల్లు To పద్మశ్రీ ’’ : అరుదైన ఫోటో షేర్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun Shared His Grand Father Allu Ramalingaiahs Photo 19282

Updated On : June 3, 2021 / 1:45 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్యతో ఆయన మనవలు, మనవరాళ్లు కలిసి తీయించుకున్న ఫొటోను బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

పద్మశ్రీ  అవార్డు అందుకుని తిరిగి వచ్చిన అల్లు రామలింగయ్యతో మెగా కుటుంబానికి చెందిన పిల్లలందరూ కలిసి తీయించుకున్న ఫొటో అది. అల్లు అర్జున్, అల్లు వెంకటేష్ (బాబి), రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ, శిరీష్ తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు.

Read Also : ‘కృష్ణ మనోహర్ ఐ.పి.ఎస్’ గా ప్రభుదేవా

‘‘మా తాతయ్య పద్మశ్రీ అవార్డు అందుకుని వచ్చిన తర్వాత మేమందరం ఆయనను విమానాశ్రయంలో కలిశాం. పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు.. అద్భుతమైన ప్రయాణం’’ అని బన్నీ షేర్ చేసిన పిక్ మెగాభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల కానుంది.