Allu Arha : అర్హ పుట్టిన రోజు.. క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ విషెష్ చెప్పిన బన్నీ..
ఇటీవలే వరుణ్ పెళ్లి నుంచి అర్హవి కొన్ని క్యూట్ ఫోటోలు స్నేహ షేర్ చేయగా తాజాగా నేడు అల్లు అర్హ ఏడవ పుట్టిన రోజు కావడంతో బన్నీ కొన్ని ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.

Allu Arjun Shares Cute Photos of Allu Arha and says Birthday Wishes
Allu Arha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గారాలపట్టి అల్లు అర్హ (Allu Arha) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బన్నీ కూతురు అర్హ తన చిలిపి అల్లరితో అల్లు అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక అల్లు అర్జున్, స్నేహారెడ్డి(Allu Sneha Reddy) రెగ్యులర్ గా అర్హ క్యూట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అర్హ ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇటీవలే వరుణ్ పెళ్లి నుంచి అర్హవి కొన్ని క్యూట్ ఫోటోలు స్నేహ షేర్ చేయగా తాజాగా నేడు అల్లు అర్హ ఏడవ పుట్టిన రోజు కావడంతో బన్నీ కొన్ని ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అలాగే వరుణ్ పెళ్ళిలో అర్హని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. నా లిటిల్ ప్రిన్సెస్ కి బర్త్ డే విషెష్ అంటూ పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే అల్లు అర్హతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో కూడా బన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి నా సంతోషం అంటూ ఆర్హ గురించి పోస్ట్ చేశాడు.
ఇక బన్నీ అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అర్హ అటు స్కూల్ కి వెళ్తూనే తన క్యూట్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఆల్రెడీ శాకుంతలం సినిమాలో నటించిన అర్హ త్వరలో మరిన్ని సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించనుందని సమాచారం. భవిష్యత్తులో అర్హ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక అర్హ పుట్టిన రోజు వేడుకల ఫోటోలు, వీడియోల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
View this post on Instagram
My Bundle of Joy #alluarha pic.twitter.com/xuyLhXWhFN
— Allu Arjun (@alluarjun) November 21, 2023