Ameerkhan : ‘కేజీయఫ్2’ టీంకి క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమీర్‌ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘లాల్‌సింగ్ చద్దా’ రోజున ఏప్రిల్ 14న రావటం సరైన నిర్ణయమే. అయితే ‘కేజీయఫ్2’ సినిమా నిర్మాత.......

Kgf
Ameerkhan : అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ సినిమాలో మన నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది అని ప్రకటించారు. అయితే అంతకు ముందే అదే రోజున తమ సినిమాను విడుదల చేయనున్నట్లు ‘కేజీయఫ్2’ చిత్ర బృందం కూడా ప్రకటించింది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన ‘కేజీయఫ్1’ ఎంత భారీ విజయం సాధించిందో మన అందరికి తెలుసు. దీంతో ‘కేజీయఫ్2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజున విడుదలైతే కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అయినా కూడా ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వనున్నాయి.
Bigg Boss 5 : నేను ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాను.. సిరికి షాకిచ్చిన శ్రీహాన్
దీనిపై ఇటీవల అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమీర్‌ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘లాల్‌సింగ్ చద్దా’ రోజున ఏప్రిల్ 14న రావటం సరైన నిర్ణయమే. అయితే ‘కేజీయఫ్2’ సినిమా నిర్మాత విడుదల తేదీని ప్రకటించారని తెలిసి కావాలనే మేము ఆ రోజును ఎంచుకోలేదు. ముందే ఆ రోజు సినిమాను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. మా సినిమా విడుదల తేదీని ప్రకటించే ముందు ‘కేజీయఫ్2’ నిర్మాత విజయ్ కిరంగదుర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, కథానాయకుడు యశ్‌లకు క్షమాపణ చెబుతూ, నా పరిస్థితి వివరిస్తూ లేఖరాశాను అన్నారు. నిర్మాతల పాలిట లాక్‌డౌన్ ఎలాంటి క్లిష్ట పరిస్థితిని తీసుకొచ్చిందో చెప్పాను, వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మా నిర్ణయానికి మద్దతు తెలిపారు. వారి సానుకూల ధోరణికి చాలా సంతోషంగా అనిపించింది అని అమీర్ తెలిపారు.
Sreenu Vaitla : డైరెక్టర్ శ్రీనువైట్లకు పితృవియోగం.. సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు
అంతే కాక ‘కేజీయఫ్’ సినిమాకు నేను కూడా అభిమానినని, ఈ విషయంపై యశ్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, ‘కేజీయఫ్’కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘కేజీయఫ్2’, ‘లాల్ సింగ్ చద్దా’ రెండు వేర్వేరు జోనర్‌లకు సంబంధించి చిత్రాలు. ప్రేక్షకులు రెండింటినీ ఆదరిస్తారు. ‘కేజీయఫ్2’కు నేను కూడా ప్రచారం చేస్తాను అని అమీర్ తెలిపారు. మొత్తానికి ఏప్రిల్ 14న రెండు భారీ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి.