Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ ఇంత బాగా పాడగలడా..? అమెరికా ఈవెంట్లో పాట పాడిన ఆనంద్.. వీడియో వైరల్..

ఆనంద్ దేవరకొండ అమెరికాలో జరిగిన తెలుగు వారి ఈవెంటులో పాట పాడి అదరగొట్టాడు.

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ ఇంత బాగా పాడగలడా..? అమెరికా ఈవెంట్లో పాట పాడిన ఆనంద్.. వీడియో వైరల్..

Anand Deverakonda Sing a Song from Baby Movie in America Telugu Event Videos goes Viral

Updated On : June 11, 2024 / 10:13 AM IST

Anand Deverakonda : విజయ్ తమ్ముడిగా పరిచయమైనా ఆనంద్ దేవరకొండ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా దొరసాని నుంచి ఇటీవల వచ్చిన గంగం గణేశా సినిమా వరకు ప్రతి సరి కొత్త కథలతో వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల వచ్చిన గం గం గణేశా సినిమా ఫుల్ లెంగ్త్ క్రైం కామెడీతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆనంద్ ఫ్యామిలీతో అమెరికాలో ఉన్నాడు.

Also Read : Raviteja – sreeleela : మరోసారి ధమాకా జంట.. రవితేజ – శ్రీలీల కొత్త సినిమా ఓపెనింగ్..

విజయ్ దేవరకొండ, ఆనంద్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలో అమెరికాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఆనంద్ దేవరకొండ అమెరికాలో జరిగిన తెలుగు వారి ఈవెంటులో పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి.. కంటి రెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాకా.. అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు.

సినిమాలో ఎంత బాగుందో ఈ పాట ఆనంద్ కూడా అంతే అద్భుతంగా పాడటంతో అంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆనంద్ అమెరికా ఈవెంట్లో పాట పాడిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆనంద్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా, ఆనంద్ ఇంత బాగా పాడగలడా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు, నెటిజన్లు. మరి భవిష్యత్తులో ఏదైనా సినిమాలో ఆనంద్ పాట పాడతాడేమో చూడాలి.