Mahesh Babu: మహేష్ కోసం లైగర్ పాపను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu: మహేష్ కోసం లైగర్ పాపను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్

Ananya Pandey In Mahesh Babu Trivikram Movie

Updated On : October 10, 2022 / 4:13 PM IST

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. తొలి షెడ్యూల్ ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది.

Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటో!

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరస అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తీసుకునేందుకు త్రివిక్రమ్ ఆసక్తిని చూపుతున్నాడట.

Mahesh Babu: మాంత్రికుడి కారణంగా టక్ చేస్తోన్న మహేష్..?

ఇటీవల లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ బ్యూటీ. దీంతో ఈ బ్యూటీని మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో అనన్య రోల్ ఫుల్ లెంగ్త్‌గా ఉండదని.. కేవలం ఓ సాంగ్‌లో మాత్రమే అమ్మడు కనిపిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సెకండ్ హీరోయిన్ రోల్‌కు అనన్య ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.