Ananya Pandey : బాయ్ ఫ్రెండ్‌తో అనన్య పాండే టూర్.. ఆ హీరోతోనే రిలేషన్?

టీవల అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్లినట్టు సమాచారం. స్పెయిన్ లో దిగిన కొన్ని ఫోటోలని తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

Ananya Pandey : బాయ్ ఫ్రెండ్‌తో అనన్య పాండే టూర్.. ఆ హీరోతోనే రిలేషన్?

Ananya Pandey in relation with Hero Aditya Roy Kapoor they went to Spain photos goes viral

Updated On : July 13, 2023 / 6:49 AM IST

Ananya Pandey Boyfriend :  బాలీవుడ్(Bollywood)లో హీరో, హీరోయిన్స్ ఎవరో ఒకరితో డేటింగ్ లోనో, ప్రేమలోనో ఉంటారని ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ లో మరో హీరో, హీరోయిన్ జంట పేరు వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా హీరోయిన్ అనన్య పాండే హీరో ఆదిత్య రాయ్(Aditya Roy Kapoor) కపూర్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం ఓ దీపావళి పార్టీలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా కనిపించిన దగ్గర్నుంచి ఈ వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ జంట ఈ వార్తలని ఇండైరెక్ట్ గా కంఫర్మ్ చేసిందా అని అనుకుంటున్నారు. ఇటీవల అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్లినట్టు సమాచారం. స్పెయిన్ లో దిగిన కొన్ని ఫోటోలని తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో అనన్య, ఆదిత్య ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకర్నొకరు హగ్ చేసుకొని మరీ దిగారు. ఇవి ఇలా అఫీషియల్ గా పోస్ట్ చేయడంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారా అనే వార్తలు మరింత ఎక్కువయ్యాయి.

Samajavaragamana OTT Release : ఓటీటీలోకి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న..! తెలుగులోనే కాదు మ‌రో మూడు భాష‌ల్లో స్ట్రీమింగ్‌..?

ప్రస్తుతం ఈ జంట బాలీవుడ్ లో వైరల్ గా మారింది. అయితే వీళ్లిద్దరికీ దాదాపు 13 ఏళ్ళ తేడా ఉంది వయసులో. అయినా ఇలాంటివి బాలీవుడ్ లో చాలా కామన్ అని అంటున్నారు నెటిజన్లు. ఇక వారి అభిమానులు అయితే ఇది నిజమేనా, నిజంగా రిలేషన్ అయితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు. అనన్య పాండే ఇటీవలే లైగర్ సినిమాతో వచ్చి ఘోర పరాజయం చూసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తోంది. ఇక ఆదిత్య రాయ్ కపూర్ ఇటీవలే ది నైట్ మేనేజర్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.