Anasuya : పాపం బాగా ఫీల్ అయినట్టు ఉంది అనసూయ.. వాళ్లంతా హీరోయిన్స్ కాదట..
అనసూయ కొంచెం చదువు నేర్చుకోండి అని హీరోయిన్ అనే పదం గురించి వరుసగా తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీలు పెడుతుంది. (Anasuya)
Anasuya
- అనసూయ వరుస పోస్టులు
- హీరోయిన్ కామెంట్స్ పై అనసూయ స్పందన
- హీరోయిన్ కి గూగుల్ నిర్వచనం
Anasuya : తన సినిమాలు, షోల కంటే వివాదాలతో ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది అనసూయ. ఇటీవల శివాజీ హీరోయిన్స్ ని మంచి బట్టలు వేసుకోండి అని చెప్పాడు. కాకపోతే ఓ రెండు పదాలు తప్పుగా వాడటంతో అది కాస్త వైరల్ అయి పెద్ద ఇష్యూ అయింది. సామాన్య జనాలు, నెటిజన్లు అంతా శివాజీకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే కొంతమంది సినీ పరిశ్రమలోని మహిళలు మాత్రం శివాజీపై విమర్శలు చేస్తున్నారు.(Anasuya)
ఈ ఇష్యూలోకి అనసూయ కూడా రావడం శివాజీపై కామెంట్స్ చేయడం చేసింది. శివాజీ క్షమాపణలు చెప్పి తనపని తాను చేసుకుంటున్నాడు. అయితే శివాజీ అన్నది హీరోయిన్ ని, నువ్వెందుకు బాధపడుతున్నావ్ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేసారు. దీంతో అనసూయ నేను కూడా హీరోయిన్ నే అని ఓ వీడియో కూడా పెట్టింది.
Also Read : Sakshi Vaidya : పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోవడంపై స్పందించిన హీరోయిన్..
ఈ హీరోయిన్ కామెంట్స్ కాస్త అనసూయ పర్సనల్ గా తీసుకున్నట్టు ఉంది. అప్పట్నుంచి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది ఈ హీరోయిన్ కామెంట్స్ మీద. తాజాగా అనసూయ కొంచెం చదువు నేర్చుకోండి అని హీరోయిన్ అనే పదం గురించి వరుసగా తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీలు పెడుతుంది.

హీరోయిన్ అంటే ధైర్యము గల స్త్రీ. హీరోయిన్ తెరపై కాదు, మాట్లాడే ధైర్యం, సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారి నడిచే శక్తి. సరైన దానికి నిలబడే గుండె. అదే నిజమైన హీరోయిన్. మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అని పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇలా తనకు సపోర్ట్ గా, తనలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్లను, మాట్లాడే వాళ్ళను గుర్తించి వాళ్ళను నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తాను అని తెలిపింది.

Also Read : Ayalaan : థియేటర్స్ లో నో రిలీజ్.. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న స్టార్ హీరో సినిమా..

దీంతో పలువురు అనసూయ కామెంట్స్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ చేసిన వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఈ దెబ్బతో అనసూయ పోస్టులు కాస్తా వైరల్ గా మారాయి. ఈ పోస్టులు చూసి హీరోయిన్ కాదు అనే కామెంట్స్ ని అనసూయ పర్సనల్ గా తీసుకున్నట్టు ఉంది, హీరోయిన్ అంటే గూగుల్ లో ఉన్న నిర్వచనం చెప్పి సినిమాల్లో నటించేవాళ్ళు అంతా నటులు మాత్రమే అని చెప్పడం చర్చగా మారింది. మరి ఈ హీరోయిన్ పోస్టులు ఇంకెంత చర్చకు దారి తీస్తాయో చూడాలి.

