Sakshi Vaidya : పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోవడంపై స్పందించిన హీరోయిన్..
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకోవడంపై స్పందించింది. (Sakshi Vaidya)
Sakshi Vaidya
- సాక్షి వైద్య ఇంటర్వ్యూ
- పవన్ కళ్యాణ్ ఛాన్స్ మిస్
- ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కామెంట్స్
Sakshi Vaidya : మరాఠీ భామ సాక్షి వైద్య తెలుగులో ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే సాక్షి వైద్య హీరోయిన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో సాక్షి వైద్య ఆ సినిమా నుంచి తప్పుకుంది.(Sakshi Vaidya)
సాక్షి వైద్య ఇప్పుడు శర్వానంద్ సరసన నారి నారి నడుమ మురారి సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకోవడంపై స్పందించింది.
Also Read : Ayalaan : థియేటర్స్ లో నో రిలీజ్.. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న స్టార్ హీరో సినిమా..
సాక్షి వైద్య మాట్లాడుతూ.. ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారని వచ్చిన వార్తలు నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ చాలా రేర్ గా ఇచ్చేవాళ్ళు. ఒక రోజు హరీష్ శంకర్ గారు కాల్ చేసి డేట్స్ కావాలి. ఎల్లుండే షూటింగ్ అన్నారు.
అప్పుడు నేను ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల వారం రోజుల పాటు అందుబాటులో లేను. దాంతో నేను షూటింగ్ కి రాలేకపోయాను. అలా డేట్స్ ఇష్యూ వల్ల ఆ సినిమా మిస్ అయ్యాను. నా ప్లేస్ లో వేరే వాళ్ళను తీసుకున్నారు. నేను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసాను. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారితో ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోను అని తెలిపింది.
Also Read : Sushmita Konidela : చిరంజీవి కూతురు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? మెగాస్టార్, పవర్ స్టార్ కాదు.. మరి ఎవరంటే..
సాక్షి వైద్య తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి శ్రీలీలను తీసుకున్నారు. అదే ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజ హెగ్దేని మొదట ప్రకటించి తర్వాత ఆమె ప్లేస్ లో రాశిఖన్నాను తీసుకున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
