ప్రకృతి ఒడిలో అనసూయ….ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్

న్యూ ఇయర్ సందర్భంగా యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అంధేరి నేషనల్ పార్క్‌లో జంగిల్ ట్రెక్కింగ్ చేశారు. తన భర్త, పిల్లలు, అమ్మనాన్నలతో కలిసి అక్కడి ప్రకృతిని ఫుల్ గా ఎంజాయ్ చేసింది.
ఆ ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హైదరాబాద్ నుంచి అక్కడి వరకు కారులోనే వెళ్లారు. ఈ మధ్యలో లంచ్ చేస్తూ.. దిగిన ఫోటోలను కూడా తను నెటిజన్లతో షేర్ చేసుకుంది. అంతేకాదు ఈ ట్రిప్ లో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అని పోస్ట్ చేసింది.
ఎవ్వరమైనా ప్రకృతి లేకుండా బతకలేం అనిపించింది. ఈ ట్రిప్ తో చాలా జ్ఞాపకాలు నా హృదయంలో ఉన్నాయి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇక అనసూయ, కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.