Anasuya Bharadwaj : ఫిట్నెస్ కోసం అనసూయ ఫీట్లు.. జిమ్‌లో తలకిందులుగా

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా పెద్ద వార్త అవుతుంది. లేటెస్ట్‌గా తలకిందులుగా ఆసనాలు వేస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.

Anasuya Bharadwaj : ఫిట్నెస్ కోసం అనసూయ ఫీట్లు.. జిమ్‌లో తలకిందులుగా

Anasuya Bharadwaj

Updated On : November 29, 2023 / 8:08 PM IST

Anasuya Bharadwaj : సినీ నటులకు జిమ్‌లలో వర్కవుట్లు తప్పనిసరి. ఏ మాత్రం షేపవుట్ అయినా అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. తాజాగా నటి అనసూయ జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్.. సినీ ప్రముఖులు ఓటు వేసే ప్రాంతాలు ఇవే..

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె డ్రెస్సింగ్‌పై, వ్యక్తిగత అంశాలపై నెటిజన్లు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. బుల్లితెరకు దూరమై సినిమాల్లో బిజీ అయిన అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉంటారు. రీసెంట్‌గా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ఒకటి అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నవంబర్ 29, 2023 సరిహద్దులు దాటి ముందుకు వెళ్లిన రోజుగా గుర్తుండిపోతుంది’ అనే శీర్షికతో ఈ పోస్టును పెట్టారు. తాడుకి వేలాడుతూ తలకిందులుగా వేసిన ఆసనం ఫోటో చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. జిమ్‌లో వర్కౌట్లతో పాటు అనసూయ ఏరియల్ యోగ చేస్తారట. దాంతో పాటు లేత కొబ్బరికాయ తింటారట. అనసూయ పోస్టుకి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Nithin : హీరో నితిన్‌కి స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపిన స్టార్ క్రికెటర్

రంగమ్మత్తగా పుష్ప సినిమాతో పాపులర్ అయిన అనసూయ చేతిలో చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే మైఖేల్, రంగ మార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం సినిమాల్లో అలరించారు. పుష్ప 2 లో కూడా అనసూయ పాత్రకు ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. దాక్షాయణిగా పుష్ప 2 లో అందర్నీ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు అనసూయ.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)Set featured image