Chandrababu – Pawan Kalyan : రాజకీయాల్లో ఎవర్ని నమ్మని చంద్రబాబు పవన్‌తో ఫ్రెండ్షిప్ ఎలా..? అన్‌స్టాపబుల్‌లో పవన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు..

చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి అనేక ఆసక్తికర కామెంట్స్ చేసారని తెలుస్తుంది.

Chandrababu – Pawan Kalyan : రాజకీయాల్లో ఎవర్ని నమ్మని చంద్రబాబు పవన్‌తో ఫ్రెండ్షిప్ ఎలా..? అన్‌స్టాపబుల్‌లో పవన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు..

AP CM Chandrababu Naidu Interesting Comments on Pawan Kalyan in Balayya Unstoppable Show

Updated On : October 22, 2024 / 7:46 AM IST

Chandrababu – Pawan Kalyan : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి మొదలు కానుంది. ఇటీవలే సీఎం చంద్రబాబుతో మొదటి ఎపిసోడ్ షూట్ అవ్వగా నిన్న రాత్రి మొదటి ఎపిసోడ్ ప్రోమో కూడా రిలిజ్ చేసారు. అయితే సాంకేతిక సమస్యల వల్ల ఆ ప్రోమోని తీసేసారు. ఈ లోపే అభిమానులు, కార్యకర్తలు ఆ ప్రోమోని డౌన్లోడ్ చేసుకొని వైరల్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఆల్రెడీ ఓ సారి బాలయ్య అన్‌స్టాపబుల్‌ రాగా ఇప్పుడు మరోసారి సందడి చేసారు.

ప్రోమోలో.. మా బావ గారు, మీ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని పరిచయం చేసారు బాలయ్య. అలాగే ఆకాశంలో సూర్యచంద్రులు ఏపీలో బాబు, కళ్యాణ్ బాబు అని అన్నారు బాలయ్య. ఈ ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలతో పాటు పవన్ కళ్యాణ్ గురించి, ఫ్యామిలీ విషయాలు గురించి మాట్లాడారని సమాచారం.

Also Read : Prabhas : అడగందే అమ్మయినా పెట్టదు.. అడక్కపోయినా అమ్మకంటే ఆప్యాయంగా ప్రభాస్ పెడతాడు.. డైరెక్టర్ కామెంట్స్..

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి అనేక ఆసక్తికర కామెంట్స్ చేసారని తెలుస్తుంది. అన్‌స్టాపబుల్‌ షోలో.. ఎవర్ని నమ్మని చంద్రబాబు నాయుడు పవన్ ని ఎలా నమ్మారు? పవన్ తో అంత మంచి బాండింగ్ ఎలా ఏర్పడింది? పవన్ తో ఉన్న స్నేహం గురించి, పొత్తులకు ముందు పవన్ కళ్యాణ్ ఏమి చెప్పి చంద్రబాబుని ఇంప్రెస్ చేసాడు.. అనే ఆసక్తికర అంశాలు చంద్రబాబు ఈ షోలో మాట్లాడినట్టు తెలుస్తుంది.

దీంతో అన్‌స్టాపబుల్‌ లో చంద్రబాబు ఎపిసోడ్ కోసం టీడీపీ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సారి అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 పై భారీ అంచనాలే ఉన్నాయి.