Arjun Sarja: మరో హీరో కోసం అర్జున్ సర్జా.. విశ్వక్ స్థానంలో శర్వానంద్.. నిజమేనా?
యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురిని పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని ఎంపిక చేసుకున్నాడు. అయితే చిత్రనిర్మాణంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయంటూ హీరో విశ్వక్ సినిమా నుంచి తప్పుకోవడంతో, మరో టాలీవుడ్ యువహీరో శర్వానంద్...

Arjun Sarja Replace Vishwak Sen with Sharwanand in his movie
Arjun Sarja: వెండితెరపై నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా సక్సెస్‌ఫుల్‌గా పని చేసి సినీరంగంలో అల్ రౌండర్ అనిపించుకున్న నటుడు “అర్జున్ సర్జా”. ఈ యాక్షన్ కింగ్ తన కూతురిని పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడి పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని ఎంపిక చేసుకున్నాడు.
Thammareddy Bharadwaja: యంగ్ హీరోలంతా ఆ పద్ధతిని మార్చుకోవాలి.. తమ్మారెడ్డి సీరియస్ కామెంట్స్..
అర్జున్ చెప్పిన కథ నచ్చడంతో విశ్వక్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా పూజ కారిక్రమాలు నిర్వహించుకున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. చిత్రనిర్మాణంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయంటూ హీరో విశ్వక్ సినిమా నుంచి తప్పుకోవడంతో.. అర్జున్, విశ్వక్‌ల మధ్య వివాదం రాచుకుంది. కాగా ఈ సినిమాలో మరో టాలీవుడ్ యువహీరో శర్వానంద్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇటీవలే ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చిన శర్వా అయితే, తన కథకు న్యాయం చేయగలడని అర్జున్ భావిస్తున్నాడట. త్వరలోనే శర్వానంద్ ని కలిసి కథ వినిపించి అతని డేట్స్ సంపాదించనున్నాడని తెలుస్తుంది. అయితే ఈ వార్తలు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మరి శర్వానంద్ ఈ కథకు ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.