Athidhi Devo Bhava: ట్రైలర్ రిలీజ్.. ఒంటరిగా ఉండడమంటే చావుతో సమానమే!

ఈ పెద్ద పండగకి పెద్ద సినిమాలు మొహం చాటేశాయి. ఒకటి తర్వాత ఒకటి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా వేసుకోవడంతో చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీలోగా..

Athidhi Devo Bhava: ట్రైలర్ రిలీజ్.. ఒంటరిగా ఉండడమంటే చావుతో సమానమే!

Athidhi Devo Bhava

Updated On : January 5, 2022 / 8:45 PM IST

Athidhi Devo Bhava: ఈ పెద్ద పండగకి పెద్ద సినిమాలు మొహం చాటేశాయి. ఒకటి తర్వాత ఒకటి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా వేసుకోవడంతో చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీలోగా చాలా సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఆ సినిమాల జాబితాలో ఆది సాయికుమార్ ‘అతిథి దేవోభవ’ కూడా ఉంది. మిర్యాల రామ్, అశోక్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో నువేక్ష కథానాయికగా పరిచయమవుతోంది.

Pan India Star’s: తారక్-చరణ్ ప్లాన్ చేశారు.. బన్నీ నిజం చేసుకున్నాడు!

ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు మరో రెండు రోజులే సమయం ఉండడంతో ప్రచారాన్ని స్పీడప్ చేసిన సినిమా యూనిట్ హీరో నాని చేతుల మీదుగా బుధవారం ట్రైలర్ విడుదల చేయించారు.

2022 Summer Movies: ఏప్రిల్ నెలపై కన్నేసిన క్రేజీ ప్రాజెక్ట్స్!

లవ్.. యాక్షన్.. ఎమోషన్ తో కూడిన సీన్స్ కనిపించాయి. ప్రేమ.. అలకలు.. ఆపై గొడవలు.. అపార్థాలు తొలగిపోవడంతో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఆదికి చాలాకాలంగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే.. ఆది ప్రస్తుతం నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు. అతిధి దేవోభవ సినిమా కనుక సక్సెస్ అయితే కెరీర్ మళ్ళీ గాడిన పడి రాబోయే సినిమాలకు ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉంటుందా అన్నది ఆసక్తిగా మారింది.