BRS Party : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం?

BRS Party : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

BRS Party : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం?

KCR and KTR

Updated On : January 2, 2026 / 1:10 PM IST

BRS Party : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అయితే, శుక్రవారం అసెంబ్లీలో మూసీ ఇష్యూపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే, సీఎం‌ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Also Read : మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం.. వారికి బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ఇలాఉంటే.. అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేపటి నుంచి సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం తెలంగాణ భవన్‌లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను బీఆర్ఎస్ నేతలు ఇవ్వనున్నారు.