Balakrishna : రామ్ ఆ సినిమా చేసి నాకు ఛాలెంజ్ విసిరాడు.. ప్రేక్షకులని థియేటర్‌కి ఎలా రప్పించాలో దర్శకనిర్మాతలు ఆలోచించాలి..

శనివారం సాయంత్రం స్కంద(Skanda) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Balakrishna : రామ్ ఆ సినిమా చేసి నాకు ఛాలెంజ్ విసిరాడు.. ప్రేక్షకులని థియేటర్‌కి ఎలా రప్పించాలో దర్శకనిర్మాతలు ఆలోచించాలి..

Balakrishna comments on Ram and Directors producers in Tollywood at Skanda Pre Release Event

Updated On : August 27, 2023 / 8:06 AM IST

Balakrishna :  రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో శ్రీలీల (Sreeleela), సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నిన్న శనివారం సాయంత్రం స్కంద(Skanda) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులని థియేటర్ కి ఎలా రప్పించాలి అనే విషయంపై దర్శక నిర్మాతలు ఆలోచించాలి. ఇప్పుడు ప్రేక్షకులని సినిమా థియేటర్ కి రప్పించడం అంత ఈజీ కాదు. కొత్తదనం ఉంటేనే వస్తున్నారు. మన సినిమాలకు ఇప్పుడు దేశమంతటా కాదు విదేశాల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి నాకు ఛాలెంజ్ విసిరాడు. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టాడు. ఇప్పుడు అది నాకు పరీక్షగా మారింది. అందుకే భగవంత్ కేసరి సినిమా తెలంగాణ నేపథ్యంలో చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ 2 చేస్తూ ఇంకో ఛాలెంజ్ విసురుతున్నాడు. దేవదాసు సినిమా నుంచి రామ్ ని చూస్తున్నాను. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నాడు. సినిమా పరిశ్రమ అంతా ఒకటే కుటుంబం. సినిమా బాగుంటే ఏ హీరోనైనా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.

Sreeleela : డ్యాన్స్ మాత్రమే కాదు సింగింగ్ కూడా.. స్కంద ఈవెంట్లో స్టేజిపై పాటలతో అదరగొట్టిన శ్రీలీల..

దీంతో బాలయ్య దర్శక నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఇదే ఈవెంట్ లో బాలయ్య అఖండ 2 సినిమా కూడా ఉంటుందని బోయపాటి తెలిపారు.