Balayya: కమెడియన్ సప్తగిరి కాళ్లు పట్టుకుంటా అన్న బాలయ్య.. ఎందుకు?
అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్న బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి టర్కీలో జరుగుతుంది. ఇలా షూటింగ్ లో ఉన్న సమయంలో బ్రేక్ రావడంతో బాలకృష్ణ, కమెడియన్ సప్తగిరిని...

BalaKrishna funny Conservation with Comedian Sapthagiri
Balayya: అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్న బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తుండగా, అనిల్ రావిపూడితో మరో మూవీ ఒప్పుకున్నారు. ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
BalaKrishna: NBK107 సెట్ లో నందమూరి మోక్షజ్ఞ.. అందుకోసమేనా!
ప్రస్తుతం NBK107 షూటింగ్ కి టర్కీలో జరుగుతుండగా శృతి హాసన్ బాలయ్యకు జంటగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా థమన్ సంగీత అందిస్తున్నాడు. డైరెక్టర్ గోపీచంద్ ప్రీవియస్ మూవీ “క్రాక్” కూడా భారీ విజయం అందుకోవడంతో ఫ్యాన్స్ దర్శకుడి మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు.
ఇలా షూటింగ్ లో ఉన్న సమయంలో బ్రేక్ రావడంతో బాలకృష్ణ, కమెడియన్ సప్తగిరిని డైలాగ్ వార్ కి ఆహ్వానించాడు. ఇక బాలయ్య పౌరాణిక చిత్రంలోని ఒక డైలాగ్ ని చెప్పగా, సప్తగిరి ఆ డైలాగుని తడబడకుండా చెప్పడంతో, బాలకృష్ణ సప్తగిరి టాలెంట్ కి ఫిదా అయ్యి..”నీ కాళ్లు పైకి పెట్టరా దండం పెడతాను” అని సరదాగా అన్నారు ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Balayya babu and Saptagiri funny conversation #NandamuriBalakrishna#Balakrishna #Saptagiri #NBK107 pic.twitter.com/iD6yDwo0zm
— Balayya Yuvasena (@BalayyaUvasena) September 9, 2022