Bhagavanth Kesari : పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ప్రత్యేక షో.. ఎందుకో తెలుసా..?

'భగవంత్ కేసరి' సినిమాని పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక షో వేయనున్న బాలకృష్ణ. ఎందుకు, ఎప్పుడో తెలుసా..?

Bhagavanth Kesari : పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ప్రత్యేక షో.. ఎందుకో తెలుసా..?

Balakrishna makes Bhagavanth Kesari special show for Pawan Kalyan

Updated On : October 24, 2023 / 5:41 PM IST

Bhagavanth Kesari : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ సినిమా ‘భగవంత్ కేసరి’. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాలో మాస్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉండడంతో.. క్లాస్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. కాగా బాలకృష్ణ ఇప్పుడు సినిమాని ప్రత్యేక షో వేసి పవన్ కళ్యాణ్ కి చూపించనున్నాడట. ఎందుకు, ఎప్పుడో తెలుసా..?

Also read : Pawan Kalyan : ఏపీ రాజకీయాలు గురించి సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలి..?

ఈ సినిమాలో ఆడవారికి సంబంధించిన రెండు మెసేజ్స్ ని ఇచ్చారు. చిన్న పిల్లలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోవాలని, ఎవరు ఏ ఉద్దేశంతో తాకుతున్నారో చిన్నతనంలోనే ఆడపిల్లలకు తెలియజేయాలని బాలకృష్ణ చెప్పాడు. అలాగే సమస్య ఎదురైనప్పుడు తనే పోరాడేలా ఆడపిల్ల పెరగాలని చెప్పుకొచ్చారు. ఇక ఈ రెండు విషయాలను పవన్ కళ్యాణ్ నిత్యం మాట్లాడుతూ ఉంటాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఈక్రమంలోనే పవన్ కి ఈ సినిమా చూపిస్తే.. మూవీలోని మెసేజ్ మరింత ఎక్కువమందికి చేరుతుందని బాలకృష్ణ భావించినట్లు సమాచారం.

Also read : Venkatesh – Keeravani : వెంకటేష్, కీరవాణి ఇంట పెళ్లి భజంత్రీలు మోగబోతున్నాయా..?

ఇక ఈ ఆలోచనతోనే బాలకృష్ణ రేపు అక్టోబర్ 25న పవన్ కళ్యాణ్ కి భగవంత్ కేసరి ప్రత్యేక షో వేసి చూపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ ముందుకు దూసుకు పోతుంది. ఇక ఇప్పుడు పవన్ నుంచి ఈ సినిమాకి మద్దతు వస్తే.. కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అమెరికాలో కూడా 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు రాబట్టి 2 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది.